మైదానంలో పుజారాను వల్గర్ గా తిట్టిన రోహిత్ శర్మ..

2022
IND vs SA 1st Test :Twitter erupts as Rohit abuses Pujara after he refuses to take a single
IND vs SA 1st Test :Twitter erupts as Rohit abuses Pujara after he refuses to take a single

విశాఖలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. మైదానంలో కూల్ గా ఉండే రోహిత్ సహనం కోల్పోయాడు. పుజారాపై హిట్ మ్యాన్ అనుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.సింగిల్ తీసేందుకు నిరాకరించిన చతేశ్వర్ పుజారాపై మైదానంలోనే తిట్ల దండకం అందుకున్నాడు. రోహిత్ శర్మ తిట్టిన మాటలు వికెట్ కీపర్ ఎండ్‌వైపు ఉన్న స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి.

దక్షిణాఫ్రికా స్పిన్నర్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి బంతిని ముందుకు ఫుష్ చేసిన రోహిత్ శర్మ సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని చతేశ్వర్ పుజారాని పిలిచాడు. దానికి స్పందించిన పుజారా కొంత దూరం వచ్చి వెనుకకు వెళ్లాడు. దాంతో సహనం కోల్పోయిన రోహిత్ అసభ్యపదజాలంతో దూషించారు.

Loading...