రోహిత్ శర్మ మరో సెంచరీ…మూడు రికార్డులు బ్రేక్

1876
IND vs SA 1st Test Vizag : Rohit Sharma breaks Navjot Sidhu and Rahul Dravid records
IND vs SA 1st Test Vizag : Rohit Sharma breaks Navjot Sidhu and Rahul Dravid records

విశాఖ టెస్టులో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించాడు. 133 బంతుల్లో 100 పరుగులను పూర్తి చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ 176 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి.

టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ వరల్డ్ రికార్డ్ సాధించాడు. దీనికి తోడు దశాబ్దాల నాటి మరో రెండు రికార్డ్స్ బద్దలయ్యాయి.ఇప్పటి వరకూ 1994లో లక్నో వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్దు బాదిన 8 సిక్సర్ల రికార్డ్ భారత్ తరఫున అగ్రస్థానంలో ఉండగా తాజాగా రోహిత్ శర్మ 10 సిక్సర్లతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.

టెస్టుల్లో వరుసగా ఏడు అర్ధశతకాలు బాదిన తొలి భారత క్రికెటర్‌గా కూడా రోహిత్ నిలిచాడు. ఇప్పటి వరకూ రాహుల్ ద్రవిడ్ ఆరు హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా తాజాగా ద్రవిడ్‌ని రోహిత్ వెనక్కి నెట్టాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రపు ఓపెనర్‌గా అత్యధిక పరుగులు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ కెప్లర్‌ వెసెల్స్‌(208) పేరిట ఉండగా దాన్ని రోహిత్‌ బ్రేక్‌ చేశాడు.ఫలితంగా ఓపెనర్‌గా తొలి టెస్టులో 303 పరుగులు సాధించి రికార్డు లిఖించాడు.

Loading...