టీమిండియాకు షాక్…మొదటి వికెట్ కోల్పోయిన కోహ్లీ సేన

1687
IND vs SA 1st Test: India loss first wicket
IND vs SA 1st Test: India loss first wicket

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాని తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 431 పరుగులకి ఆలౌట్ చేసింది. ఆటలో నాలుగో రోజైన శనివారం 385/8తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సఫారీలు తొలి సెషన్‌లోనే 431 వద్ద కుప్పకూలిపోయారు. రెండో ఇన్నీంగ్స్ ను ప్రారంభించిన కోహ్లీసేనకు ఆదిలోనె బిగ్ షాక్ తగిలింది. మొదటి టెస్టులో డబుల్ సెంచీరీ చేసిన మయాంక్ అగర్వాల్ (7) కే అవుట్ అయ్యారు. కేశవ్ మహారాజ్ వేసిన 8 ఓవర్ ఆఖరు బంతికి పెలియన్ చేరాడు. మయాంక్ బ్యాట్ హెడ్జ్ కు తాకిన బంతి నేరుగా స్లిప్ లో ఉన్న డుప్లెసిస్ చేతికి చిక్కింది. దీంతో టీమిండియా రెండో ఇన్నీంగ్స్ లో 21 పరుగుల వద్ద తొలివికెట్ ను కోల్పోయింది. లంచ్ సమయానికి క్రీజులో రోహిత్ (14) పుజారా ఉన్నారు.ప్రస్తుతం ఇండియా 93 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన మయాంక్ త్వరగా ఔటవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Loading...