Thursday, April 25, 2024
- Advertisement -

పంత్ కు ఇదే చివరి అవకాశం….హెచ్చరించిన కోహ్లీ

- Advertisement -

ధర్మశాల వేదికగా టీమిండియా, సఫారీల మద్య జరగాల్సిన మొదటి టీ-20 వర్షం కారణంగా రద్దయింది. ఈ రోజు రెండో టీ-20 మ్యాచ్ మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు జరగనుంది. అయితే రెండో టీ20 మ్యాచ్ పై కెప్టెన్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు.రెండో టీ-20 మ్యాచ్ కోసం తమ యువ ఆటగాళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. వీరిలో నాలుగో స్థానంలో అయ్యర్ లేదా మానిష్ పాండే ఆడనున్నారు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్ తన స్థానాన్ని పదిల పరుచుకోవాలంటే అతడు ఈ మ్యాచ్ లో ఖశ్చితంగా రాణించాల్సి న అవసరం ఉందని కోహ్లీ అన్నారు. ఒకే తరహా షాట్‌కు ప్రతి సారీ ఔటవడం ఆందోళనకు కలిగిస్తోందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఈ సిరిస్‌లో అతడు తన బలహీనతను అధిగమిస్తాడని కోహ్లీ అశాభావం వ్యక్తం చేశాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న చాహర్, సుందర్‌లు రాణిస్తారని కోహ్లీ పేర్కొన్నాడు.ఆల్ రౌండర్లు పాండ్యా బ్రదర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వారి ప్రదర్శన అందరికీ తెలిసిందేనన్నారు. సఫారీల జట్టు బలంగా ఉన్నప్పటికి….వారిని కట్టడి చేసేందుకు మా దగ్గర అన్ని అస్ర్తాలు ఉన్నట్లు ఈ డ్యాషింగ్ ప్లేయర్ పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -