మారని పంత్ తీరు….డైలమాలో కెరీర్..ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు

457
Ind vs SA 2nd T20 : Rishabh Pant Again Got Trolled On Twitter For His Rash Shot at Mohali
Ind vs SA 2nd T20 : Rishabh Pant Again Got Trolled On Twitter For His Rash Shot at Mohali

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ చేతులారా తన కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. మేనేజ్ మెంట్ పంత్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటన్నింటిని చేజార్చుకుంటున్నారు. విండీస్ టూర్ లో విఫలం చెందినా స్వదేశంలో సఫారీలతో జరుగుతున్న సిరీస్ లో పంత్ కు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికాతో మొహాలి వేదికగా బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో పేవల ఆటతీరుతో తనకు దొరికిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

పంత్ కు ఇదే చివరి అవకాశం అని తనని తాను నిరూపించుకోవాలని కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలు హెచ్చరించినా పంత్ తన పంథాను మార్చుకోవడంలేదు. రెండో టీ20 మ్యాచ్ లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ తన నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ సమర్పించుకున్నాడు. తక్కువ స్కోరుకి ఔటవడం కంటే అతని పేలవ షాట్ సెలక్షన్‌‌పై ఇటీవల టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మ్యాచ్‌లో 150 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు 11.4 ఓవర్లు ముగిసే సమయానికి 94/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన పంత్ …మరో ఎండ్‌లో ఉన్న నిలకడగా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లి (72 నాటౌట్: 52 బంతుల్లో 4×4, 3×6)కి సహకరించినా సరిపోయేది.

కాని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫార్చూన్ లెగ్ స్టంప్‌ లైన్‌పై విసిరిన బంతిని.. ఏమాత్రం ఫీల్డర్‌ని చూసుకోకుండా అలసత్వంగా ఫైన్ లెగ్ దిశగా హిట్ చేసేశాడు. దీంతో.. అక్కడే ఉన్న ఫీల్డర్ షంషీ లడ్డులా క్యాచ్ అందుకున్నాడు. మూడో టీ20 మ్యాచ్ లో మాత్రం పంత్ విఫలం అయితే అతని కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. పేవల షాట్ తో పంత్ అవుట్ అవడంపై నెటిజన్లు విరుచుకుపడుుతన్నారు.

Loading...