Thursday, April 25, 2024
- Advertisement -

మైదానంలో కట్టలు తెంచుకున్న కోహ్లీ కోపం…

- Advertisement -

టీమిండియా కెప్టెన్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అందరికి తెలిసిందే. ముఖ్యంగా.. ఫీల్డింగ్‌‌లో తాను తప్పిదాలు చేయకుండా జాగ్రత్తపడే కోహ్లీ.. సహచరులు ఎవరైనా తప్పులు చేస్తే..? మాత్రం కోపం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన కోహ్లీ.. శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్‌లో తడబడటంతో అతనిపై ఆగ్రహంతో ఊగిపోయాడు.

ఇన్నింగ్స్ 10వ ఓవర్ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ బవుమా బంతిని పాయింట్ దిశగా హిట్ చేశాడు. అక్కడే ఫీల్డర్ శ్రేయాస్ అయ్యర్ ఉండటంతో.. ఒక పరుగు మాత్రమే వస్తుందని అంతా ఊహించారు. కాని అనూహ్యంగా మూడు పరుగులు రావడంతో కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు.

బంతిని అందుకోవడంలో తత్తరపాటుకి గురైన శ్రేయాస్.. వేగంగా ఆ బంతిని అందుకుని త్రో చేయలేకపోయాడు. దీంతో.. బవుమా – డికాక్ జోడీ డబుల్ పూర్తి చేయగా.. అనంతరం శ్రేయాస్ విసిరిన బంతిని బౌలర్ హార్దిక్ పాండ్య పట్టించుకోలేదు. ఇదే సమయంలో బవుమా – డికాక్ జోడీ మూడో పరుగు తీసింది. దీంతో కోహ్లీ సహనం కోల్పోయాడు.

ఆలస్యంగా తన చేతికి వచ్చిన బంతిని తీసుకుని ఆఫ్ స్టంప్‌ని గాల్లోకి ఎగరగొట్టేశాడు. వాస్తవానికి అప్పటికే బవుమా క్రీజులోకి వచ్చారు.కోపంతో కోహ్లీ అలా వికెట్‌ని పడగొట్టగా.. వెనుక నుంచి ఫీల్డ్ అంపైర్ సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాడు.

https://twitter.com/harshalgadakh7/status/1174328091633577984

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -