Wednesday, April 24, 2024
- Advertisement -

టీ 20 సిరీస్ ను సమం చేసిన సఫారీలు….

- Advertisement -

టీ20 సిరీస్ లో భాగంగా బెంగళూరులో జరిగిన మూడో టి20 మ్యాచ్ సఫారీలు టీమిండియా పై ఘనవిజయం సాధించారు. అన్ని విభాగాల్లోను సమిష్టిగా రాణించన దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 36 పరుగులతో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (20 బంతుల్లో 19; ఫోర్, సిక్స్‌), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (17 బంతుల్లో 19; ఫోర్, సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. రబడ (3/39) మూడు వికెట్లు పడగొట్టగా, పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఫార్చూన్‌ (2/19), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బ్యురాన్‌ హెన్‌డ్రిక్స్‌ (2/14)కు రెండేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లు, ఫార్టుయిన్ 2, హెండ్రిక్స్ 2 వికెట్లు తీశారు.

అనంతరం 135 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ డీకాక్ ముందుండి జట్టును విజయతీరాలకు చేర్చారు. అతడి దూకుడైన బ్యాటింగ్‌తో ఆ జట్టు ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 16.5 ఓవర్లలో 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. డికాక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.

డికాక్ 52 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (28), టెంబా బవుమా (27 నాటౌట్) నుంచి మంచి సహకారం లభించింది. దాంతో 16.5 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 140 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య మాత్రమే వికెట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -