Thursday, April 18, 2024
- Advertisement -

రోహిత్ శర్మ డకౌట్….పేలుతున్న జోకులు

- Advertisement -

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు మూడురోజుపాటు జరుగుతున్న సన్నాహక మ్యాచ్ లో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ డకౌట్ గా వెనుతిరగడంతో అంచనాలను తలక్రిందులు చేశారు. మూడోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌతాఫ్రికా 64 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు చేసింది.సఫారీలతో టెస్టు సిరీస్‌కు ఓపెనర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న రోహిత్‌ కేవలం రెండు బంతులే ఆడాడు. ఫిలాండర్‌ బౌలింగ్‌లో కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.సన్నాహక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావించిన హిట్‌మ్యాన్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ డకౌట్ అవడం అందర్నీ తీవ్ర నిరాశ పరిచింది. దీంతో రోహిత్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.వేటుకి గురైన రాహుల్ సెంచరీ సాధించడమేంటి..? 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తొలిసారి టెస్టుల్లో ఆడబోతున్న రోహిత్ శర్మ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడి డకౌటవడమేంటి..? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్ శనివారం కేరళతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. 122 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన కేఎల్ రాహుల్ 131 పరుగులు చేశాడు . బుధవారం నుంచి విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. మయాంక్ అగర్వాల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని రోహిత్ శర్మ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -