రోహిత్ నాలా చేయవద్దు….లక్మణ్

386
IND vs SA Test Series :Laxman warns Rohit to not make mistakes that he made when asked to open innings
IND vs SA Test Series :Laxman warns Rohit to not make mistakes that he made when asked to open innings

దక్షిణాఫ్రికాతో బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా రోహిత్ కు మాజీ క్రికెటర్ లక్మణ్ కీలక సూచనలు చేశారు. ఈ సిరీస్ లో రోహిత్ ను ఓపెనర్ గా బరలోకి దింపాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. నాలాగా తప్పు చేయవద్దని ఈ అవకాశాన్ని చక్కగా వాడుకోవాలని తన అనుభవంతో విలువైన సలహాలు ఇచ్చాడు లక్మణ్.

విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ఆరంభంకానుండగా.. ఇప్పటి వరకూ టెస్టుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ మొదటిసారి ఓపెనర్‌గా ఆడబోతున్నాడు. టీ20,వన్డేల్లో తిరుగులేని ఓపెనర్ గా కొనసాగుతున్న రోహిత్ 5 రోజుల టెస్ట్ మ్యాచ్ లో ఎలా ఆడతారో అనేది ఆసక్తికరంగా మారింది. వార్మప్ మ్యాచ్ లో భాగంగా సఫారీలతో ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్ లెవన్ వర్సెస్ టీమిండియాలు విజయనగరం వేదికగా మూడో రోజైన సెప్టెంబరు 28న భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, మయాంక్ బరిలోకి దిగగా, రెండో ఓవర్లో రెండు బంతులు మాత్రమే ఆడి రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు.

టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడినా సహజసిద్ధమైన ఆటని మాత్రం మార్చుకోవద్దని తాజాగా రోహిత్ శర్మకి సూచించిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు.గతంలో తాను చేసిన తప్పుని చేయద్దంటూ హితవు పలికాడు.వీవీఎస్ లక్ష్మణ్.. 1996-98లో టీమిండియా మేనేజ్‌మెంట్ ఒత్తిడి మేరకు టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడాడు. కానీ.. విఫలమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ మిడిలార్డర్‌కి మారి 134 టెస్టుల్లో 8,781 పరుగులు చేశాడు.

మంచి ఫామ్ లో ఉండటం రోహిత్ కు కలసి వచ్చే అంశం.నేను అప్పట్లో ఓపెనర్‌గా మారే సమయానికి కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. కాని రోహిత్ గత 12 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు.అప్పట్లో ఓపెనింగ్ చేయాలి అనగానే నా సహజసిద్ధమైన ఆటతో పాటు మైండ్‌సెట్‌ని కూడా మార్చుకున్నాను. దీంతో ఆ ప్రభావం నా బ్యాటింగ్‌పై పడింది. కానీ.. రోహిత్ శర్మ ఆ తప్పు చేయడని నేను ఆశిస్తున్నా’ అని వీవీఎస్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Loading...