Thursday, April 25, 2024
- Advertisement -

టెస్ట్ సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్…..? అతనిస్థానంలో ఎవరంటే…?

- Advertisement -

అందరూ అనుకున్నట్లు గానె రిషబ్ పంత్ కెరీర్ డైలమాలో పడింది. ప్రపంచకప్ నుంచి ఇప్పటి వరకు పంత్ ఇచ్చిన అవకాశాలను ఉపయేగించుకోవడంలో విఫలం అయ్యారు. పంత్ పై ఎన్ని విమర్శలు వచ్చినా జట్టుమేనేజ్ మెంట్ మాత్రం అతనికి ఎక్కువే అవకాశాలు ఇచ్చింది. సఫారీలతో జరిగిన టీ20 సిరీస్ లో కూడా పంత్ పేవల బ్యాటింగ్ తో అవుట్ అయి విమర్శలు ఎదుర్కొన్నారు. పంత్ స్థానంలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని మాజీ క్రికెటర్లనుంచి పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక పంత్ ను కొనసాగించే ఉద్దేశ్యంలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ లేనట్లు సమాచారం.

త్యర్థి బౌలర్లు ఊరిస్తూ వేస్తున్న బంతులకు పంత్‌ భారీ షాట్లకు పోయి వికెట్లు సమర్పించుకుంటున్నాడు.దాంతో దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు పంత్‌ను పక్కకు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు పంత్ కు సపోర్ట్ చేస్తూ వచ్చిన కోహ్లీ,కోచ్ సైతం టెస్ట్ సిరీస్ కు పక్కన పెట్టాలని అతన్ని కొన్నేళ్లు పక్కన పెట్టడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. సఫారీలతో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పంత్‌ను ఆడించి చూద్దామని సెలక్టర్లు అనుకున్నప్పటికీ అందుకు కోహ్లి, రవిశాస్త్రిలు వద్దనే చెప్పారట. దీంతో పంత్ స్థానంలోవృద్ధిమాన్‌ సాహాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

పంత్‌ ఒక వరల్డ్‌క్లాస్‌ ఆటగాడని రవిశాస్త్రి చెబుతున్నప్పటికీ అతని ఆటపై ఎక్కడో కాస్త అనుమానం ఉండటంతో రిస్క్‌ చేయదల‍్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఇందుకు కోహ్లి నుంచి రవిశాస్త్రి మద్దతు ఉండటంతో పంత్‌కు ఉద్వాసన చెప్పినట్లేనని కథనాలు వెలువడుతున్నాయి. మరో వైపు కీపింగ్ లోను కూడా విఫలం అవుతున్నారు. వికెట్ల వెనుక కీపర్‌ స్థానంలో డీఆర్‌ఎస్‌ విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండాలి. ఇందులో కూడా పంత్‌ విఫలమవుతూ వస్తున్నాడు. ప్రత్యేకంగా భారత్‌ వంటి బంతి టర్న్‌ అయ్యే పిచ్‌ల్లో డీఆర్‌ఎస్‌ను నిర్దారించడంలో పంత్‌ ఇబ్బంది పడుతున్నాడు. అందుకే కొన్ని నెల్లపాటు పంత్ ను జట్టుకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెుస్తోంది. ఎంఎస్‌ ధోనికి సరైన ప్రత్యామ్నాయం రిషభ్‌ పంత్‌ అని భావించినా అది కాస్తా మూన్నాళ్ల ముచ్చెటే అవుయినట్లు తెలుస్తోంది. మళ్లీ దేశవాళీ టోర్నీలో పంత్‌ తానేంటో నిరూపించుకునే వరకూ అతనికి అవకాశాలు ఇవ్వకూడదనే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉంది. ఒకవేళ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సాహాను ఆడించి అక్కడ మరోసారి తనను తాను నిరూపించుకుంటే మాత్రం పంత్‌ కెరీర్‌ సందిగ్థంలో పడటం ఖాయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -