రోహిత్ శర్మకి మద్దతు తెలిపిన పాక్ మాజీ క్రికెటర్….

385
IND vs WI 1st Test :Akhtar wants 'match-winner' Rohit in playing 11 in opening Test
IND vs WI 1st Test :Akhtar wants 'match-winner' Rohit in playing 11 in opening Test

వెస్టిండీస్‌తో గురువారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అంటిగ్వా వేదికగా మొదటి టెస్ట్ రాత్రి 7 గంటలకు మొదలు కానుంది. వన్డే,టీ20 సిరీస్ లను గెలిచిన కోహ్లీసేన టెస్ట్ సిరీస్ ను క్లాన్ స్విప్ చేయాలని పట్టుదలతో ఉంది. మొదటి టెస్టులో పాల్గొనే జట్టులో రోహిత్ శర్మకు స్థానం ఉంటుందా ఉండదా అన్న సందేహం మొదలయ్యింది. రోహిత్ శర్మాకు హనుమ విహారి పోటీ ఇస్తున్నారు ఇస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారనేది సస్పెన్ష్ కు గురిచేస్తోంది.

ఇదలా ఉంటె రోహిత్ ను తీసుకోవాలని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సూచించారు.రోహిత్ శర్మ లేదా హనుమ విహారిలో ఒక్కరికే తుది జట్టులో చోటివ్వాలని భారత్ యోచిస్తోంది. ప్రపంచకప్ లో ఐదు సెచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ కే అఅవ్వాలని అక్తర్ సూచించారు.ఒకవేళ అతడ్ని పక్కన పెడితే మాత్రం అదో పెద్ద తప్పిదం అవుతుందని హెచ్చరించాడు.

ఇప్పటికే రోహిత్ కు టెస్టుల్లో మేనేజ్ మెంట్ చాలా అవకాాలు ఇచ్చింది. అయితే వచ్చిన అవకాశాలను పేవల బ్యాటింగ్ తో వినియోగించుకోలేదు.ఇప్పుడు అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌పై టెస్టుల్లో అవకాశమిస్తే..? కచ్చితంగా జట్టుని గెలిపించగలడు. ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం అది టీమిండియా తప్పిదమే అవుతుంది. టెస్టు ఫార్మాట్‌లో రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు కాగలడు’ అని అక్తర్ ధీమా వ్యక్తం చేశాడు.

Loading...