నేటి నుంచి విండీస్ తో భారత్ మొదటి టెస్ట్….

287
IND vs WI 1st test : India vs West Indies 1st Test starts
IND vs WI 1st test : India vs West Indies 1st Test starts

విండీస్ పర్యటనలో టీమిండియా విజయాలతో దూసుకుపోతోంది. వన్డే, టీ20 సిరీస్ లను కైవసం చేసుకున్న కోహ్లీ సేన టెస్ట్ సీరీస్ ను టార్గెట్ చేసింది. వన్డే ప్రపంచ కప్‌ వైఫల్యం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మన జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది.

నేటి నుంచి విండీస్, ఇండియా మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.ఆంటిగ్వా వేదికగా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. మొత్తం రెండు టెస్టులని ఈ సిరీస్‌లో టీమిండియా ఆడనుంది.బౌలర్లు ఇషాంత్ శర్మ, అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత్ తరఫున మైదానంలోకి దిగనుండగా.. టీ20, వన్డేలకి దూరంగా ఉన్న బుమ్రా జట్టుతో చేరాడు.

అయితే భారత జట్టు ఓపెనర్లలో మార్పులు జరగనున్నాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌‌కి జోడీ ఎవరు ఓపెనింగ్ చేస్తారు..? అనే సందేహాలు నెలకొన్నాయి. కేఎ ఎల్ రాహుల్ జట్టులో ప్రొఫెషనల్ ఉన్నా హనుమ విహారి గట్టి పోటీ ఇస్తున్నారు.ఇక మిడిలార్డర్‌లో అజింక్య రహానె లేదా రోహిత్ శర్మని ఆడించాలా..? అనే మీమాంసలో టీమిండియా ఉంది.

ఆఖరిగా సీనియర్ వికెట్ కీపర్ సాహాకి ఛాన్సిస్తారా..? లేక ఇటీవల టీ20, వన్డేల్లో తేలిపోయిన రిషబ్ పంత్‌కి మరో అవకాశమిస్తారా..? అనేది చూడా అన్నది చూడాలి. అంటవగ్వా పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందనే వార్తల నేపథ్యంలో కోహ్లీ సేన ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌ బరిలోకి దిగనుంది.

తుది జట్లు అంచనా..

భారత్‌: రాహుల్‌/విహారి, మయాంక్, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానే/రోహిత్, పంత్‌/సాహా, జడేజా, అశ్విన్,షమీ, బుమ్రా, ఇషాంత్‌.

వెస్టిండీస్‌:బ్రాత్‌వైట్, కాంప్‌బెల్, హోప్, డారెన్‌ బ్రేవో, హెట్‌మైర్, చేజ్, డౌరిచ్, హోల్డర్‌ (కెప్టెన్‌), కార్న్‌వాల్‌/కీమో పాల్, రోచ్, గాబ్రియెల్‌.

Loading...