Thursday, April 18, 2024
- Advertisement -

వన్డే సిరీస్ క్లీన్ స్విప్ పై కోహ్లీ సేన గురి….

- Advertisement -

ప్రంచ కప్ వైఫల్యం తరువాత విండీస్ టూర్ లో టీమిండియా వరుస విజయాలతో అదరగొడుతోంది. టీ20 ని క్లీన్ స్వీప్ చేసిన కోహ్లిసేన..మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్విప్ చేసె దానిపై గురిపెట్టింది. మూడు వన్డేల్లో భాగంగా మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు అవుగా, రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా బుధవారం రాత్రి 7 గంటల నుంచి మూడో వన్డే జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే 2-0తో సిరీస్‌ సొంతంకానుంది.

టీమిండియాలో కోహ్లీ రెండో వన్డేలో శతకం బాదడం ద్వారా ఫామ్ అందుకోగా.. రోహిత్ శర్మ కూడా బ్యాట్ ఝళిపిస్తున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ మాత్రం పేవల బ్యాటింగ్ ను కనబరుస్తున్నారు. ఇటీవల ముగిసిన మూడు టీ20లు, ఒక వన్డే మ్యాచ్‌లో అతను చేసిన పరుగులు వరుసగా 1, 23, 3, 2 మాత్రమే. దీంతో.. విండీస్ పర్యటనలో నిరూపించుకునేందుకు ఈరోజే అతనికి ఆఖరి ఛాన్స్.

ఇక విండీస్ విషయానికి వస్తే బౌలింగ్‌లో ఫర్వాలేకున్నా బ్యాటింగ్‌ వెస్టిండీస్‌ను కలవరపరుస్తోంది. గేల్ కు ఇదే ఆఖరి వన్డే కావడంతో ఎలా ఆడుతాడో చూడాలి. హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్‌లతో భారీ లైనప్‌ ఉన్నా ఎవరి నుంచి విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ రావడం లేదు. ఆరు వికెట్లు చేతిలో ఉన్నా రెండో వన్డేలో 71 బంతుల్లో 91 పరుగుల చేయలేకపోవడమే దీనికి నిదర్శనం.సీనియర్లు కార్లోస్ బ్రాత్‌వైట్, జేసన్ హోల్డర్‌ నిరాశపరుస్తున్నారు. మరోవైపు బౌలింగ్‌లోనూ థామస్, కీమోపాల్, కాట్రెల్ నిలకడగా రాణించలేకపోతున్నారు. దీంతో ఒత్తిడితోనె విండీస్ బరిలోకి దిగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -