Thursday, April 25, 2024
- Advertisement -

కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులు…..

- Advertisement -

పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు రికార్డులు బద్దలవుతున్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో శతకం బాదిన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లోను రెండు సెంచరీలు బాదారు.

ఇప్పటివరకూ కోహ్లి వన్డేల్లో 43 సెంచరీలు సాధించి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే శతకాల రికార్డుకు మరింత చేరువగా వచ్చాడు. సచిన్‌ వన్డేల్లో 49 సెంచరీలు సాధించగా, ఆ మార్కును చేరడానికి కోహ్లికి ఆరు సెంచరీల దూరంలో నిలిచాడు.

ఈ దశాబ్దంలో 20,018 పరుగులు చేసిన కోహ్లీ ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం పాంటింగ్‌ 18,962 పరుగులతో దశాబ్దంలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్‌ తర్వాత దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వెస్ కలిస్‌ (16,777), శ్రీలంక ఆటగాళ్లు జయవర్ధనే (16,304), కుమార సంగక్కర (15,999) ఉన్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (15,962) ఆరో స్థానంలో ఉన్నాడు.

మరొకవైపు వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు. వన్డే కెప్టెన్‌గా కోహ్లి 21 శతకాలు చేయగా, ముందు వరుసలో పాంటింగ్‌ ఉన్నాడు. పాంటింగ్‌ 22 సెంచరీలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌ విండీస్‌ పర్యటనలో కోహ్లికి ఇది నాల్గో వన్డే సెంచరీ కాగా, మాథ్య హేడెన్‌ మూడు శతకాలు చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -