Thursday, April 25, 2024
- Advertisement -

బుమ్రా దెబ్బకి విండీస్ విలవిల..మొదటి టెస్టులో కోహ్లీసేన ఘన విజయం

- Advertisement -

వెస్టిండీస్ గడ్డపై టెస్టుల్లోనూ భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే,టీ20 సిరీస్ లను కైవసం చేసుకున్న కోహ్లీసేన టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్విప్ చేయడంపై గురిపెట్టింది. అంటిగ్వా వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన 318 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నీంగ్స్ లో భూమ్రా దెబ్బకి కరేబియన్ జట్టు నూరు పరుగులకే చాపచుట్టేసింది.
మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ 81 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసిన భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానెకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ లభించగా.. ఈ మ్యాచ్‌తోనే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా తన ఆగమనాన్ని చాటింది.

టెస్టు చరిత్రలోనే రికార్డు లక్ష్యమైన 419 పరుగుల ఛేదనకు దిగిన విండీస్‌ నాలుగో రోజు 26.5 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు బుమ్రా (5/7), ఇషాంత్‌ శర్మ (3/31), షమీ (2/13) చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో రోస్టన్‌ చేజ్‌ (29 బంతుల్లో 12; ఫోర్‌), కీమర్‌ రోచ్‌ (31 బంతుల్లో 38; ఫోర్, 5 సిక్స్‌లు), మిగెల్‌ కమిన్స్‌ (22 బంతుల్లో 19 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) మినహా మిగతావారు కనీసం రెండంకెల స్కోరు చేయకుండానే వెనుదిరిగారు.

ఆంటిగ్వాలో గత గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు.. భారత్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. అజింక్య రహానె (81: 163 బంతుల్లో 10×4), రవీంద్ర జడేజా (58: 112 బంతుల్లో 6×4, 1×6) హాఫ్ సెంచరీలు బాదడంతో 297 పరుగులకి ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ జట్టు.. ఇషాంత్ శర్మ (5/43) జోరుతో అనూహ్యంగా 222 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో రోస్టన్ ఛేజ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో.. 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌ని అజింక్య రహానె (102: 242 బంతుల్లో 5×4) సెంచరీ, హనుమ విహారి (93: 128 బంతుల్లో 10×4, 1×6) శతక సమాన ఇన్నింగ్స్ ఆడటంతో 343/7 వద్ద డిక్లేర్ చేసింది. ఈ విజయంతో భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సంపాదించింది. రెండో టెస్టు ఈనెల 30న కింగ్‌స్టన్‌లో మొదలవుతుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -