Friday, April 19, 2024
- Advertisement -

ఓట‌మిపై స్పందించిన ఆసిస్ కెప్టెన్ టిమ్ పైన్‌..

- Advertisement -

మెల్‌బోర్న్‌లో జిర‌గిని మూడో టెస్ట్‌లో భార‌త్ చారిత్రాత్మక విజ‌యం సాధించింది. ప్ర‌తిష్టాత్మ‌క‌ బాక్సింగ్ డే టెస్ట్‌లో విజ‌యం సాధించాల‌నే భార‌త్ క‌ల ఇప్ప‌టికి తీరింది. భార‌త బౌల‌ర్ల ధాటికి 261 ప‌రుగులకే చేతులెత్తేసింది. ఈ టెస్ట్‌లో భార‌త్ 137ప‌రుగుల‌ ఆధిక్యంతో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆసిస్ ఓట‌మిపై ఆ జ‌ట్టు కెప్టెన్ టిమ్‌ పైన్ స్పందించారు. సిరీస్‌లో 2-1తో ఆధిక్యాన్ని అందుకుంది
భార‌త్

ఓటమికి బ్యాట్స్‌మెన్‌ అనుభవరాహిత్యమే కారణమని పైన్ తెలిపారు. ఈ ఓటమి కాస్త నిరాశను కలిగించింద‌న్నారు. ఈ మ్యాచ్‌లో బౌల‌ర్లు రాణించినా బ్యాట్స్‌మెన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పేలవంగా విఫలమవడం తనని నిరాశపరిచిందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దిగ్గజ పేస్‌ అటాక్‌ ఉన్న జట్టుతో ఆడుతున్నాం. కానీ మా జట్టులో టాప్‌-6 బ్యాట్స్‌మెన్‌ అనుభవం లేనివారే. మా తప్పిదాలను తెలుసుకొని ముందుకు సాగుతామ‌ని వెల్ల‌డించారు.

బౌలింగ్‌లో పాట్ కమిన్స్ అద్భుతంగా రాణించాడు. కానీ.. బ్యాట్స్‌మెన్ తేలిపోవడంతో మా జట్టుకి ఓటమి తప్పలేదు. మ్యాచ్‌లో ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. అయితే.. సిడ్నీ వేదికగా గురువారం నుంచి జరగనున్న ఆఖరి టెస్టులో విజ‌యం కోసం ప్ర‌య‌త్నిస్తామ‌ని తెలిపారు. చివరి టెస్ట్‌ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను భారత్‌ కాపాడుకుంటే సిరీస్‌ భారత్‌ వశం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -