Tuesday, April 23, 2024
- Advertisement -

దినేష్ కార్తిక్‌, జాద‌వ్‌పై వేటు….నెంబ‌ర్ 4లో ఎవ‌రంటే….?

- Advertisement -

సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో ఓటమి భారత్ ను ఇంటిముఖం పట్టించింది. దీంతో జ‌ట్టులో మార్పుల‌పై బీసీసీఐ శ్రీకారం చుట్టింది. మొద‌టినుంచి టీమిండియాకు నెంబ‌ర్ 4 స్థానం ప‌ట్టి పీడిస్తోంది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు చాలా మంది ఆటగాళ్ల‌ను ప‌రీక్షించినా వారెవ‌రూ కూడా ఆస్థానాన్ని భ‌ర్తీ చేయ‌లేక‌పోయారు.

ఇద‌లా ఉంటె..ప్రపంచకప్‌‌లో పేలవ ప్రదర్శనతో కొద్ది మంది క్రికెటర్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్ర‌ధానంగా ధోని, దినేష్ కార్తిక్‌, జాద‌వ్‌ల ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఏకంగా ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని ఇప్ప‌టికే అన్ని వైపుల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ జాబితాలో కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్‌ ముందు వరుసలో ఉన్నారు. వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన దినేశ్ కార్తీక్.. అవకాశం దొరికిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 8 పరుగులతో నిరాశపరిచిన కార్తీక్.. కీలకమైన సెమీస్‌లో 6 పరుగులకే ఊసురుమ‌నిపించాడు.ఇప్పటికే అనేక చాన్సులు అందుకున్న డీకే, వరల్డ్ కప్ వైఫల్యంతో తన కెరీర్ ను తానే కష్టాల్లోకి నెట్టుకున్నాడు. విండీస్ టూర్‌కు దినేష్ కార్తిక్‌పై సెల‌క్ట‌ర్లు క‌రుణ‌చూపుతారో లేదో ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఇక జాద‌వ్ ను కూడా పెట్టాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ పర్యటన కోసం శుక్రవారం భారత్ జట్టుని సెలక్టర్లు ఎంపిక చేయ‌నున్నారు. ఈ టూర్‌లో యువ‌కుల‌కు ఎక్కువ అవ‌కాశాలు ఇవ్వాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్నారు. దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీలను పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దినేశ్ కార్తీక్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ని, జాదవ్ స్థానంలో శుభమన్ గిల్‌కి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారు. ధోని స్థానంలో వికెట్ కీప‌ర్‌గా పంత్ ఉండ‌నే ఉన్నారు.

వెస్టిండీస్-ఎ జట్టుతో తాజాగా జరుగుతున్న అనధికార వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్ లు ఆడిన అయ్యర్ రెండు అర్థసెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ అయితే నం.4 స్థానంలో అతికినట్టు సరిపోతాడన్నది సెలక్షన్ కమిటీ అభిప్రాయంగా తెలుస్తోంది. ధోని భ‌విత్వం సెల‌క్ట‌ర్ల‌పైనె ఆధార‌ప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -