క‌ష్టాల్లో టీమిండియా

462
India vs Australia, 1st Test at Adelaide: Pujara, Ashwin Bring Up Fifty Partnership
India vs Australia, 1st Test at Adelaide: Pujara, Ashwin Bring Up Fifty Partnership

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ బ్యాట్స్‌మెన్ ఎప్ప‌టిలాగే త‌మ వైఫ‌ల్యాల‌ను కొన‌సాగించారు.ఆడిలైడ్‌లో జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25)లు పెవిలియన్‌కు చేరారు. టీమిండియా కోల్పోయిన ఆరు వికెట్లలో హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, స్టార్క్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆసీ​స్‌ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఆసీస్ బౌల‌ర్లు దాటికి ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 15 పరుగుల​కే ఓపెనర్లు రాహుల్‌, విజయ్‌ పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ కోహ్లి వెంటనే అవుటయ్యాడు. రహానే కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ పుజారా, రోహిత్‌తో కలిసి కాసేపు పోరాడాడు. ఈ జోడిని లియాన్‌ విడదీశాడు. కుదురుకుంటున్న రోహిత్‌ను పెవిలియన్‌ను పంపాడు. ఆపై కాసేపటికి రిషబ్‌ పంత్‌ను కూడా లియాన్‌ ఔట్‌ చేసి భారత్‌కు మరో షాకిచ్చాడు.ప్ర‌స్తుతానికి పూజారాతో పాటు అశ్విన్ క్రీజులో ఉన్నారు.