ఆసిస్‌పై ప‌ట్టు బిగిస్తున్న భార‌త్‌..

637
India vs Australia 1st Test : day 2 live score updates adelaide
India vs Australia 1st Test : day 2 live score updates adelaide

భారత్‌తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కీలక వికెట్లు చేజార్చుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఎదురీదుతోంది. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఆరంభంలోనే భారత్ జట్టు 250 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు 63 ఓవర్లు ముగిసే సమయానికి 150/6 తో కొన‌సాగుతోంది.

ఓపెనర్ అరోన్ ఫించ్‌‌ని తొలి ఓవర్‌లోనే ఇషాంత్ శర్మ డకౌట్‌గా పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ హారిస్ (26)తో పాటు ఉస్మాన్ ఖవాజా (28), షాన్ మార్ష్ (2)‌లను అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హాండ్స్‌కబ్ (34)ని బుమ్రా పెవిలియన్ బాట పట్టించడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది.

అయితే హ్యాండ్స్‌కోంబ్, ట్రావీస్ హెడ్‌లు కలిసి ఆచితూచి ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. అయితే బుమ్రా హ్యాండ్స్‌కోంబ్‌‌ను అవుట్ చేయడంతో ఈ జోడికి తెరపడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 70 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ట్రేవిస్ హెడ్ 39, కమ్మిన్స్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.