Saturday, April 20, 2024
- Advertisement -

స్లెడ్జింగ్ తో ఆసిస్ బ్యాట్స్‌మేన్‌కు చుక్క‌లు చూపించిన యువ‌కెర‌టం రిష‌బ్ పంత్‌….

- Advertisement -

క్రికెట్ ఫీల్డ్‌లో నోటికి పని చెప్పడంలో ఆస్ట్రేలియాను మించిన వాళ్లు లేరు. స్లెడ్జింగ్‌తోనే సగం మ్యాచ్‌ను గెలిచేస్తారు. మరీ ఇండియన్ టీమ్‌తో మ్యాచ్ అంటే కంగారూలు మరింత రెచ్చిపోతారు. కాని ఇప్పుడు మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది.వికెట్ కీప‌న్ రిష‌బ్ పంత్ ఆసిస్ బ్యాట్స‌మేన్‌ల‌కు చుక్కులు చూపించాడు.స్లెజ్జింగ్‌కు మారు పేరైనా ఆసిస్‌కు దాని రుచి చూపించాడు.

గత మ్యాచ్‌ల స్థాయిలో లేకున్నా ఈ మ్యాచ్‌లో సైతం కొంత మంది ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ భారత్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌లపై నోరుపారేసుకుని ఈ మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌కు ఆజ్యం పోసాడు. ఈ తరహా స్లెడ్జింగ్‌కు మిగతా ఆటగాళ్లు స్పందించకపోయినా.. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సమర్ధవంతంగా తిప్పికొట్టాడు.

ఒకే టెస్ట్‌లో 11 క్యాచ్‌లతో వరల్డ్ రికార్డు సృష్టించిన పంత్.. ఈ మ్యాచ్‌లో స్టంప్స్ వెనుక నుంచి ఆసీస్ బ్యాట్స్‌మెన్ సహనాన్ని పరీక్షించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ ఖవాజాను స్లెడ్జింగ్ చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో ప్యాట్ కమిన్స్ రాగానే నోటికి పని చెప్పాడు. ఇక్కడ ఆడటం అంత ఈజీ కాదు.. ఈజీ బాల్స్‌ను కూడా కొట్టలేకపోతున్నావ్ అంటూ అతన్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాడు.

ఇంగ్లండ్‌ పర్యటనతో టెస్ట్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పంత్‌.. మెళ్లిగా జట్టు సభ్యులతో కలిసిపోయినట్లు అనిపిస్తోందని గావాస్కర్‌ పేర్కొన్నాడు. జట్టులోకి వచ్చిన కొత్తలో పంత్‌.. అశ్విన్‌ సర్‌ లేక అశ్విన్‌ భాయ్‌ అనేవాడని, ఇప్పుడు అశ్లే అనడం చూస్తే ఈ విషయం అర్థం అవుతుందన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో సైతం పంత్‌ తన నోటికి పనిచెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -