Saturday, April 20, 2024
- Advertisement -

కోహ్లీ మెరుపు శ‌త‌కం…మెరిసిన ధోనీ..రెండో వ‌న్డేలో అద్భుత విజ‌యం సాధించిన టీమిండియా

- Advertisement -

అడిలైడ్‌లో జ‌రిగిన రెండో వ‌న్డేలో టీమిండియా అబ్భుత విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా విసిరిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ 1-1తో సమమైంది. 108 బంతుల్లో 5×4, 2×6 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ (104: 112 బంతుల్లో 5×4, 2×6) కీలక సమయంలో వికెట్ చేజార్చుకున్నాడు.

అప్పటికి భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు (43.4 ఓవర్లు). మరో 38 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పటికి ధోనీ 25 పరుగులతో ఆడుతున్నాడు. ఈ తరుణంలో అందరిలో ఉత్కంఠ పెరిగిపోయింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు సాగిన గేమ్‌లో.. కోహ్లీ, ధోనీలు తమ బ్యాటింగ్ ట్యాలెంట్‌తో ఆక‌ట్టుకున్నారు. ఆసీస్ విసిరిన 299 ర‌న్స్ టార్గెట్‌ను.. భార‌త్ మ‌రో 4 బంతులు మిగిలి ఉండ‌గానే అందుకున్న‌ది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో ధోనీ ఓ సిక్స‌ర్‌, సింగిల్‌తో.. భార‌త్‌కు సూప‌ర్ విక్ట‌రీ అందించాడు.

రోహిత్ శ‌ర్మ 43, దినేశ్ కార్తీక్ 25 నాటౌట్‌తో టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో షాన్ మార్ష్ 131 ర‌న్స్ చేశాడు. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు.. కెప్టెన్ కోహ్లీ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. వ‌న్డేల్లో అత‌ను 39వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 112 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 104 ర‌న్స్ చేశాడు.

అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఒకానొక దశలో 134 పరుగులకే ఆస్ట్రేలియా 4 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో షాన్ మార్ష్ ఆపద్బాంధవుడి పాత్రను పోషించి 123 బంతుల్లో 131 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (4/44) ఆకట్టుకోగా.. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (0/76) తేలిపోయాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -