Friday, March 29, 2024
- Advertisement -

ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన‌ చాహ‌ల్‌..

- Advertisement -

భారత స్పిన్నర్‌ యజువేంద్ర చహల్ దెబ్బ‌కు ఆసిస్ మూడో వ‌న్డేలో కుప్ప‌కూలింది. ఆరు వికెట్లు తీసి భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు . దీంతో భార‌త్ వ‌న్డేసిరీస్‌ను 2-1తో కౌవ‌సం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో జట్టులో చోటు దక్కని చాహల్.. సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో బరిలో దిగి సత్తా చాటాడు. 24వ ఓవర్లో బంతిని అందుకున్న అతడు.. షాన్ మార్ష్, ఉస్మాన్ ఖవాజా సహా ఆరుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు.

ఆస్ట్రేలియా గడ్డ మీద వన్డే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్ చాహల్. ఆసీస్‌లో చాహల్ కంటే ముందు 8 మంది స్పిన్నర్లు 5 వికెట్ల హాల్‌లో చేరారు. కానీ వీరెవరూ ఆరు వికెట్లు తీయలేదు.

భారత్ వెలుపల రెండుసార్లు 5 వికెట్ల హాల్ సాధించిన తొలి భారత స్పిన్నర్ చాహల్. గత ఏడాది దక్షిణాఫ్రికాపై చాహల్ 22 పరుగులకే 5 వికెట్లు తీశాడు. నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత.. ఆసియా వెలుపల రెండుసార్లు ఐదేసి వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ చాహల్.

వన్డేలు, టీ20ల్లో కలిపి ఒకటి కంటే ఎక్కువసార్లు 6 వికెట్ల హాల్‌లో చేరిన రెండో బౌలర్ చాహల్. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజింత మెండిస్ మాత్రమే వన్డే, టీ20ల్లో ఆరేసి చొప్పున వికెట్లు పడగొట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -