Thursday, April 25, 2024
- Advertisement -

మెల్‌బోర్న్‌లో మెరిసిన ధోనీ… ఆసిస్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన ఇండియా..వ‌న్డే కైవ‌సం

- Advertisement -

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా చ‌రిత్ర సృష్టించింది. తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం సాధించింది. యజ్వేంద్ర చహాల్ స్పిన్ మ్యాజిక్‌తో ఆతిధ్య జట్టును 230 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు…ధోనీ ఫైటింగ్ హాఫ్ సెంచరీతో సంచలన విజయం సాధించి వ‌న్డే సిరీస్‌ను కూడా కైవ‌సం చేసుకుంది.

బెస్ట్ వన్డే ఫినిషర్ ఎమ్మెస్ ధోనీ మరోసారి మెరిసిన వేళ.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో కోహ్లి సేన విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 87 పరుగులతో ధోనీ నాటౌట్‌గా నిలిచాడు. అతనికి కేదార్ జాదవ్ చక్కని సహకారం అందించాడు. జాదవ్ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లి 46, ధావన్ 23 పరుగులు చేశారు.

231 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (9: 17 బంతుల్లో 1×6), శిఖర్ ధావన్ (21: 44 బంతుల్లో) నిరాశపరిచినా.. మూడో వికెట్‌కి విరాట్ కోహ్లీ (46: 62 బంతుల్లో 3×4)తో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని మహేంద్రసింగ్ ధోని (53 నాటౌట్: 77 బంతుల్లో 3×4) నెలకొల్పాడు. జట్టు స్కోరు 113 వద్ద కోహ్లీ ఔటవగా అనంతరం వచ్చిన కేదార్ జాదవ్ ధోనీతో క‌ల‌సి టీమిండియాను విజ‌య‌ప‌ధంలో న‌డిపించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దెబ్బకు ఆసీస్‌ టీమ్‌ 230 పరుగులకే కుప్పకూలింది. 48.4 ఓవర్లలోనే కంగారూ టీమ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. చాహల్ బంతులను ఎదుర్కోలేక ఆసీస్ బ్యాట్స్‌మెన్ వికెట్లు వరుస పెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (58), షాన్ మార్ష్ (39), ఉస్మాన్ ఖావాజా (34) మాత్రమే కాస్తా ఫరవాలేదనిపించారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో చహాల్ 6 వికెట్లు తీయగా…భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీశారు. సిరీస్‌ను భార‌త్ 2-1తో కైవ‌సం చేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -