Friday, April 19, 2024
- Advertisement -

చిత‌క్కొట్టి ధావ‌న్‌, రోహిత్‌….ఆసిస్‌కు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించి టీమిండియా

- Advertisement -

మొహాలీలో ఆసిస్‌తో జ‌రుగుతున్న నాలుగో వ‌న్డేలో భార‌త్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆసీస్ బౌలర్లపై తొలి ఓవర్ నుంచే ఎదురుదాడి మొదలుపెట్టింది. మూడు న్డేల్లో విఫ‌ల‌మ‌యిన రోహిత్‌, శిఖ‌ర్ జోడీ ఈ మ్యాచ్‌లో దుమ్ముద‌లిపింది. శిఖర్ ధావన్ (143: 115 బంతుల్లో 18×4, 3×6) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ (95: 92 బంతుల్లో 7×4, 2×6) శతక సమాన ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియాకి 359 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. సుదీర్ఘకాలం తర్వాత తొలి వికెట్‌కి 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధావన్- రోహిత్ జోడీ. ఓపెనింగ్ జోడీ భారీ స్కోరుకు బాట‌లు వేయ‌గా రిషభ్ పంత్‌ (36), విజయ్‌ శంకర్‌ (26) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ 5, రిచర్డ్‌సన్‌ 3 వికెట్లు తీశారు.సెంచరీ సాధించిన తర్వాత శిఖర్ ధావన్ శివాలెత్తిపోయాడు. పేసర్లు, స్పిన్నర్లు అని తేడాలేకుండా.. బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 254 వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ క్లీన్‌బౌల్డవగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి (7: 6 బంతుల్లో 1×4), లోకేశ్ రాహుల్ (26: 31 బంతుల్లో 1×4), కేదార్ జాదవ్ (10: 12 బంతుల్లో) నిరాశపరిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -