ఆసిస్‌తో సిరీస్‌కి రోహిత్ దూరం…

586
India vs Australia ODI series: Rahul is replaced by Rohit
India vs Australia ODI series: Rahul is replaced by Rohit

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వ‌రల్డ్‌క‌ప్ ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా కూర్పుపై దృష్టి సారించింది మేనేజ్ మెంట్‌. సీనియ‌ర్ ఆట‌గాళ్లు గాయాల పాలు కాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. సుదీర్ఘంగా సిరీస్‌ల‌ను ఆడుతున్న ఆట‌గాళ్లకు .. త్వ‌ర‌లో ఆసిస్‌తో జ‌రిగే వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు విశ్రాంతి నిచ్చే అలోచ‌న‌లో ఉంది బీసీసీఐ.ఇటీవల న్యూజిలాండ్ పర్యటన నుంచి విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు.. తాజాగా రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకి విశ్రాంతినివ్వాలని చర్చిస్తున్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియాపై టీ20, వన్డేల నుంచి రోహిత్ కి విశ్రాంతి నిస్తే అత‌ని స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించే అవ‌కాశంఉంది. ఇటీవల లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించి రెండు శతకాలు, మూడు అర్ధశతకాలు సాధించిన అజింక్య రహానెని కూడా మూడో ఓపెనర్‌గా ఎంపిక చేసే సూచనలూ కనిపిస్తున్నాయి. ఇక మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, విజయ్ శంకర్‌లకి మరోసారి అవకాశం ఇచ్చి.. సిరీస్‌లో ప్రదర్శన ఆధారంగా ప్రపంచకప్ జట్టు ఎంపికపై స్పష్టత తెచ్చుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

Loading...