Friday, April 19, 2024
- Advertisement -

ఓపెన‌ర్‌గా రిష‌బ్ పంత్‌…? మ‌రి శిఖ‌ధావ‌న్ ను ప‌క్క‌న పెట్టిన‌ట్టేనా…?

- Advertisement -

ఇంగ్లండులో త్వ‌ర‌లో జ‌రిగే ప్ర‌పంచ క‌ప్‌కు టీమిండియా జ‌ట్ట‌ను సిద్దం చేస్తోంది బీసీసీఐ. దీనిల‌భాగంగా త్వ‌ర‌లో ఆసిస్‌ జ‌రిగే వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌లో ప్ర‌యోగాల‌కు పెద్ద‌పీట వేస్తోంది బీసీసీఐ. సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌ను ప‌క్క‌న పెట్టి యువాట‌గాళ్ల‌ను ప‌రీక్ష‌స్తోంది. సీనియ‌ర్ ఆటగాడు దినేష్‌కార్తిక్‌ను టీ20ల‌కు మాత్ర‌మే ఎంపిక చేసిన టీమిండియా రిష‌బ్‌పంత్‌ను మాత్రం వ‌న్డే, టీ20కి ఎంపిక చేసింది. దీంతో.. ప్రపంచకప్‌లోనూ అతనికి మార్గం సుగుమమైనట్లు తెలుస్తోంది. ఇద‌లా ఉంటే రిష‌బ్‌ను ఓపెన‌ర్‌గా పంపాల‌ని మాజీ క్రికెట‌ర్లు బీసీసీఐకి స‌ల‌హాలు ఇస్తున్నారు.

సుదీర్ఘ చర్చ అనంతరం చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని రిషబ్ పంత్‌ను వన్డే జట్టులోకి ఎంపిక చేశాం. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడంతో.. బ్యాటింగ్ ఆర్డర్‌లో అతనికి నప్పే స్థానంపై త్వరలోనే ఓ స్పష్టత రావొచ్చంటూ సెల‌క్ట‌ర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.

అయితే ఓపెన‌ర్‌గా రిష‌బ్ వ‌స్తే ఫామ్‌లో కొన‌సాగుతున్న శిఖ‌ర్ ధావ‌న్ ప‌రిస్థితి అనేదానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. వన్డే జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మెరుగ్గా రాణిస్తున్నారు. మిడిల్ ఆర్డ‌ర్‌లో వ‌స్తున్న రిష‌బ్‌ను ఎలా ఆడిస్తార‌నే ప్ర‌శ్న ఆస‌క్తిని రేకిత్తిస్తోంది. మూడో స్థానంలో విరాట్ కోహ్లికి అద్వితీయమైన రికార్డ్ ఉంది.. నాలుగులో సీనియర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు ఆడతాడని గతంలోనే ప్రకటించారు.మూడో స్థానంలో విరాట్ కోహ్లికి అద్వితీయమైన రికార్డ్ ఉంది.. నాలుగులో సీనియర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు ఆడతాడని గతంలోనే ప్రకటించారు. ఒక వేల ఆస్ట్రేలియాపై సిరీస్‌లో ధావన్‌ను తప్పించి ఓపెనర్‌గా పంత్‌ని ఆడిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అది ప్రయోగమే అయినా.. ఒకవేళ హిట్ అయితే..? వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌రో కొత్త జోడీ హిట్టింగ్ చూడ‌టం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -