Thursday, April 25, 2024
- Advertisement -

ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన షా, కోహ్లీ….

- Advertisement -

సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్‌తో ఈరోజు ఆరంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లు అద‌ర‌గొట్టారు. తొలిరోజు ఆటకు వరుణుడు అడ్డుపడగా, రెండో రోజు ఆటలో భారత జట్టు ప్రాక్టీస్‌లో భళా అనిపించింది.ఐదుగురు భారత ఆటగాళ్లు హాఫ్‌ సెంచరీలతో మెరిసి ప్రాక్టీస్‌ను సద్వినియోగం చేసుకున్నారు. టాపార్డర్‌లో కేఎల్‌ రాహుల్‌(3) మినహా అంతా ఆకట్టకున్నారు.

ఓపెనర్ పృథ్వీ షా (66: 69 బంతుల్లో 11×4), కెప్టెన్ విరాట్ కోహ్లి (64: 87 బంతుల్లో 7×4, 1×6), చతేశ్వర్ పుజారా (54: 89 బంతుల్లో 6×4) అజింక్య రహానె (56 రిటైర్డ్ ఔట్: 123 బంతుల్లో 1×4), హనుమ విహారి (53: 88 బంతల్లో 5×4, 1×6) అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది.

టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్ కెప్టెన్ శామ్ వైట్‌మాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల ఆసీస్‌పై టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్.. పృథ్వీ షా‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. కానీ.. ఐదో ఓవర్‌లోనే రాహుల్ (3: 18 బంతుల్లో) పేలవంగా ఔటై నిరాశపరచగా.. ఆ తర్వాత చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పృథ్వీ షా వరుస బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న పృథ్వీ షా.. జట్టు స్కోరు 96 వద్ద ఔటయ్యాడు.

ఇక రోహిత్‌ శర్మ(40; 55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) బాధ్యతాయుతంగా ఆడాడు. దాంతో్ భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌ ఆటముగిసే సమయానికి వికెట్‌ కోల్పోకుండా 24 పరుగులు చేసింది. క్రీజ్‌లో డీఆర్సీ షార్ట్‌(10 బ్యాటింగ్‌), మ్యాక్స్‌ బ్రయాంట్‌(14 బ్యాటింగ్‌)లు ఉన్నారు.

ఆఖర్లో రిషబ్ పంత్ (11 నాటౌట్: 17 బంతుల్లో 1×4) నిలకడగా ఆడేందుకు ప్రయత్నించినా.. అశ్విన్ (0), మహ్మద్ షమీ (0), ఉమేశ్ యాదవ్ (0) వరుసగా డకౌటవడంతో భారత్ 358‌కే పరిమితమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -