Tuesday, April 23, 2024
- Advertisement -

వ‌న్డేల్లో దినేష్ కార్తిక్ కెరీర్ ముగిసిన‌ట్లేనా…?

- Advertisement -

త్వ‌ర‌లో స్వ‌దేశంలో జ‌ర‌నున్న రెండు టీ20, ఐదు వ‌న్డేల‌కు టీమిండియా జ‌ట్టును శుక్ర‌వారం ప్ర‌క‌టించింది బీసీసీఐ. వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయ‌లో జ‌ట్టును ప్ర‌క‌టించారు. విశ్రాంతి తీసుకుంటున్న విరాట్‌, బూమ్రా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చారు. అయితే వ‌న్డేల్లో మాత్రం సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తిక్‌ను పూర్తిగా ప‌క్క‌పెట్టింది టీమిండియా మ‌నేజ్ మెంట్‌. రిష‌బ్ పంత్‌కు స్తానం క‌ల్పించింది. దీంతో దినేష్ కార్తిక్ వ‌న్డే కెరీర్ ముగిసిన‌ట్లేన‌ని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించింది. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞుడు దినేశ్ కార్తీక్‌ను కాదని ఢిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్ రిజర్వ్ ఓపెనర్‌గా బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. దినేశ్ కార్తీక్‌ను కేవలం టీ20లకు మాత్రమే ఎంపిక చేశారు.

సుదీర్ఘంగా ఆడుతున్న రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాల‌ని అనుకున్నా అందుకు స‌హాసం చేయ‌లేదు బీసీసీఐ. ఆసీస్‌తో రెండు టీ20లకు చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చిన కమిటీ.. పంజాబ్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను జట్టులోకి తీసుకున్నది. ఇద‌లా ఉంటే చివ‌రి మూడు వ‌న్డేల‌కు ఎంపిక చేసిన జ‌ట్టే ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్‌కు పంపే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండో వికెట్ కీపర్, రిజర్వ్ బ్యాట్స్‌మన్ స్థానం కోసం చర్చ ఎక్కువగా జరిగినా.. చివరకు కమిటీ ధోనీ వారసుడు రిషబ్ పంత్‌కు ఓటేసింది.

తొలి రెండు వన్డేలకు జట్టు

కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, షమీ, చాహల్, కుల్దీప్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, సిద్ధార్థ్ కౌల్, కేఎల్ రాహుల్.

చివరి మూడు వన్డేలకు జట్టు
కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, రాయు డు, కేదార్ జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, భువనేశ్వర్, చాహల్, కుల్దీప్ షమీ, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్.

టీ20లకు జట్టు
కోహ్లీ (కెప్టెన్), రోహిత్, కేఎల్ రాహుల్, ధవన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, చాహల్, బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -