Friday, April 26, 2024
- Advertisement -

గెలుపైనా, ఓటమైనా ఇండియా చేతుల్లోనే..!

- Advertisement -

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాల్గో టెస్ట్ మ్యాచ్ మంచి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. విజ‌యం ఇరు జట్లను ఊరిస్తుంది. శనివారం తొలి సెషన్‌లో భారత పేసర్ల ఉత్సాహంపై రెండో సెషన్‌లో రూట్‌ ( 48), మూడో సెషన్‌లో బట్లర్‌ ( 69) నీళ్లు చల్లారు. దీంతో ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ పోరాటంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో షమీ 3, ఇషాంత్‌ శర్మ 2 వికెట్లు తీయగా, బుమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 8 వికెట్లకు 260 పరుగులు చేసింది.

ప్రస్తుతం ఆ జట్టు 233 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను భారత పేసర్లు ఇబ్బంది పెట్టారు. జట్టు స్కోరు 24 పరుగుల వద్ద కుక్‌ ను బుమ్రా ఔట్‌ చేయగా, కాసేపటికే మొయిన్‌ అలీని ఇషాంత్‌ పెవిలియన్‌ చేర్చాడు. అయితే లంచ్‌ విరామానికి ముందు షమీ బౌలింగ్‌లో జెన్నింగ్స్‌ వికెట్ల ముందు దొరికిపోవడంతో మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -