Friday, March 29, 2024
- Advertisement -

చివ‌రి టెస్ట్‌లో భార‌త్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండు…టీమిండియాలో హ‌నుమ విహారీకి చోటు

- Advertisement -

ఇండియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్ప‌టికే3-1తో సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. టీమిండియాలో ఓ మార్పు చేశారు. హార్థిక్ పాండ్యా స్థానంలో హ‌నుమ విహారీని తీసుకున్నారు. ఇండియా త‌ర‌ఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 292వ ప్లేయ‌ర్ విహారి.

నాలుగో టెస్టులో పేలవ ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కనీసం ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ వెటరన్ ఓపెనర్ అలిస్టర్ కుక్‌కి కెరీర్‌లో ఇదే ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచి కుక్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

టీమ్‌లో క‌రుణ్ నాయ‌ర్ రూపంలో మ‌రో సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ ఉన్నా కూడా అత‌న్ని కాద‌ని విహారిని తుది జ‌ట్టులోకి తీసుకోవ‌డం విశేషం. మరోవైపు అశ్విన్ స్థానంలో జడేజా టీమ్‌లోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సౌతాంప్టన్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నది.

భారత జట్టు: శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంగ్లాండ్ జట్టు: అలిస్టర్ కుక్, జెన్నింగ్స్, మొయిన్ అలీ, జో రూట్ (కెప్టెన్), బెయిర్‌స్టో (వికెట్ కీపర్), బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, కుర్రాన్, ఆదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -