Saturday, April 20, 2024
- Advertisement -

పంత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు….? కోచ్ రవిశాస్త్రి

- Advertisement -

ధోని వారసుడిగా ప్రశంసలు అందుకుంటున్న యువక్రికెటర్ రిషబ్ పంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేవల షాట్ లతో అవుట్ అవుతూ తన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పంత్ తన ఆటతీరును మార్చుకోక పోతె భారీ మూల్యం తప్పదని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి హెచ్చరించారు.

విండీస్ టూర్ పంత్ ఘోరంగా విఫలం అయ్యారు. ఎన్ని విమర్శలు వచ్చినా పంత్ కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. అయితే వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతూ తన స్థానానికే ముప్పు తెచ్చకుంటున్నారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. తప్పిదాల్ని వేగంగా దిద్దుకోవాలని పంత్‌కి సూచించారు రవిశాస్త్రి. తన ఆట తీరును మార్చుకోకపోతె వేటు తప్పదని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

విండీస్ పర్యటన‌లో పంత్ నిర్లక్ష్యపు షాట్స్‌తో వికెట్ చేజార్చుకున్నాడు. ట్రినిడాడ్ వన్డేలో భారత్ జట్టు ఛేదనకు దిగగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు ఓపికగా అతను సహకరించాల్సిన రిషబ్ పంత్.. తొలి బంతికే పేలవ షాట్‌తో ఔటైపోయాడు. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడు కష్టసమయంలో వేవల షాట్ ఆడి ఔట్ అయితే దాని ప్రభావం టీమ్ పై పడుతుంది.

మరో వైపు పంత్ పై వేటు వేసి ఇషాన్ కిషన్ లేదా సంజు శాంసన్‌కి అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఒకవేళ దక్షిణాఫ్రికా‌తో సిరీస్‌లో రిషబ్ పంత్ ఫెయిలైతే..? అతనిపై వేటు పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -