Saturday, April 20, 2024
- Advertisement -

ధోనికి సెలక్టర్లు బిగ్ షాక్….కేరీర్ ముగిసినట్లేనా…?

- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ సెలెక్టర్లు పొమ్మనలేక పొగబెట్టారు. సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ధోని ఎంపిక అవుతారని అందరూ భావించినా సెటెక్టర్లు మాత్రం షాక్ ఇచ్చారు. గురువారం సెలక్షన్ కమిటీ సమావేశమై సౌతాఫ్రికాతో ఆడబోయే 15 మంది సభ్యుల జట్టును బీసీసీై ప్రకటించింది. ఈ జాబితాలోధోనీకి చోటు దక్కలేదు.

వెస్టిండీస్‌తో ట్వీ20 సిరీస్ ఆడిన జట్టులో ఒకే ఒక్క మార్పుచేశారు. భువనేశ్వర్ కుమార్‌ స్థానంలో ఆల్‌రౌండ్ హార్ధిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్నారు. ధోనిని తీసుకోకపోవడంపై బీసీసీఐ మీద అభిమానులు గుర్రుగా ఉన్నారు. విండీస్ టూర్ లో ఘోరంగా విఫలం అయిన పంత్ కు మరోసారి అవకాశం ఇచ్చారు.

ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు బాదిన శ్రేయాస్ అయ్యర్‌ టీమ్‌లో చోటు నిలుపుకోగా.. మనీశ్ పాండేకి మరో ఛాన్స్ లభించింది. మొత్తంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో.. యువ క్రికెటర్లకి అవకాశాలివ్వడం ద్వారా వారిని పరీక్షించాలని సెలక్టర్లు యోచిస్తున్నారు.

వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్‌కు ఎంఎస్ ధోనీ దూరంగా ఉన్నాడు. టెరిటోరియల్ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న ధోనీ కొన్ని రోజుల పాటు కశ్మీర్‌లో సైనిక విధులు నిర్వహించాడు. పారా మిలిటరీలోని 106టీఏ బెటాలియన్‌‌తో కలిసి డ్యూటీ చేశాడు. విధుల అనంతరం ధోని ఇంటికి చేరుకున్నారు.సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లో ధోనీ ఆడతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అతడిని జట్టులోకి తీసుకోలేదు సెలెక్టర్లు. ఇక దీని బట్టి చూస్తె ధోని కెరీర్ ముగిసినట్టే అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

టీ20 జట్టు:

విరాట్ కొహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -