రాహుల్ కు షాక్.. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

409
India vs Southafrica test series :Shubman Gill Gets Maiden Call-up as BCCI Announce 15-Member India Squad For Tests Against South Africa
India vs Southafrica test series :Shubman Gill Gets Maiden Call-up as BCCI Announce 15-Member India Squad For Tests Against South Africa

రాహుల్ కు షాక్.. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ కు భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు
క్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడు టెస్టుల సిరీస్‌కు భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు.ఈ మేరకు గురువారం 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.

ఈ జట్టులో కేఎల్ రాహుల్ కు స్థానం దక్కలేదు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కారణంగా అతన్ని పక్కనపెట్టినట్టు సమాచారం. రాహుల్ స్థానంలో శుబ్ మన్ గిల్ ను తీసుకున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ ను తిరిగి టెస్టుల్లోకి తీసుకున్నారు.

దాంతో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ ఇన్నింగ్స్‌ను పంచుకోనున్నాడు. ఇక శుబ్‌మన్‌ గిల్‌కు టెస్టుల్లో తొలిసారి పిలుపు వచ్చింది.మరొకవైపు సఫారీలతో మూడు టీ20ల సిరీస్‌లో ఎంపిక కాని కుల్దీప్‌ యాదవ్‌ను టెస్టుల్లో తీసుకున్నారు. కాగా, యజ్వేంద్ర చహల్‌కు మాత్రం చోటు కల్పించలేదు. వికెట్‌ కీపర్లలో రిషభ్‌ పంత్‌తో పాటు వృద్ధిమాన్‌ సాహాను ఎంపిక చేశారు.

భారత జట్టు ఇదే..
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, చతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, రవి చంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌

Loading...