Thursday, April 25, 2024
- Advertisement -

రెండో టెస్టులో భారత్ ఘనవిజయం…టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్విప్ చేసిన కోహ్లీ సేన

- Advertisement -

విండీస్ గడ్డపై టీమిండియా విజయాలతో తన జైత్రయత్రను ముగించింది. రెండో టెస్టులో భారత్ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్ ను 2-0 తో క్లీన్ స్విప్ చేసింది.ఈ గెలుపుతో విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.

మొత్తం 48 టెస్టులకు సారథ్యం వహించిన కోహ్లీ 28 టెస్టు విజయాలతో మాజీ సారథి ధోనీ రికార్డును అధిగమించాడు. 60 మ్యాచుల్లో జట్టును ముందుండి నడిపించిన ధోనీ 27 విజయాలు అందించాడు. జమైకా టెస్టును గెలవడం ద్వారా కోహ్లీ ఆ రికార్డును అధిగమించాడు.

468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ 59.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్స్‌(50) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బ్లాక్‌వుడ్‌(38), హోల్డర్‌(39), బ్రేవో(23) పరుగులు చేశారు. మహ్మద్‌ షమి, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది.సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన తెలుగు తేజం గాదె హనుమ విహారి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు.మొదటి టెస్ట్‌లో 318 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌తో కరీబియన్ గడ్డపై టీమిండియా పర్యటన ముగియగా.. ఈనెల 15 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్ మొదలుకానుంది.

శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 416 పరుగులకి ఆలౌటైంది. జట్టులో హనుమ విహారి (111: 225 బంతుల్లో 16×4) శతకం సాధించగా.. మయాంక్ అగర్వాల్ (55), విరాట్ కోహ్లి (76), ఇషాంత్ శర్మ (57) హాఫ్ సెంచరీలు సాధించారు

మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు.. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (6/27) దెబ్బకి 117 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో సిమ్రాన్ హెట్‌మెయర్ (34) టాప్ స్కోరర్‌గా నిలవగా.. భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్ (14) అరంగేట్రం మ్యాచ్‌లో నిరాశపరిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌ని 168/4 వద్ద ఆదివారం డిక్లేర్ చేసింది. టీమ్‌లో అజింక్య రహానె (64 నాటౌట్: 109 బంతుల్లో 8×4, 1×6), హనుమ విహారి (53 నాటౌట్: 76 బంతుల్లో 8×4) అజేయ హాఫ్ సెంచరీలు చేశారు.

486 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విండీస్ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. భారత బౌలర్లు రవీంద్ర జడేజా (3/58), మహ్మద్ షమీ (3/65), ఇషాంత్ శర్మ (2/37) దెబ్బకి వరుసగా వికెట్లు చేజార్చుకున్న విండీస్ టీమ్.. కేవలం 59.5 ఓవర్లలోనే 210 పరుగులకి ఆలౌటైంది.

Image result for india-and-west-indies/ind-vs-wi-2nd-test-india-beat-west-indies-by-257-runs-to-win-series-2-0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -