నేడే విండీస్‌తో భార‌త్ ఢీ…

218
India vs West Indies , CWC 2019 : Team India vs West Indies ICC Cricket World Cup 2019 today
India vs West Indies , CWC 2019 : Team India vs West Indies ICC Cricket World Cup 2019 today

ప్రపంచకప్‌లో వ‌రుస‌ విజయాలతో దూసుకెళుతున్న టీమ్‌ఇండియా మరో పోరాటానికి సర్వ సన్నద్ధమైంది. మాంచెస్టర్‌ వేదికగా ఈరోజు ఈ రెండు జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచి బెర్త్ క‌రారు చేసుకోవాల‌ని టీమిండియా ప‌ట్టుద‌ల‌తో ఉండ‌గా…మ‌రో వైపు విండీస్‌కూడా గెలిచి సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నంతో ఉంది.

చిరకాల ప్రత్యర్థి పాక్‌ను మట్టికరిపించిన ఇక్కడి ఓల్డ్‌ట్రఫోర్డ్ మైదానంలో విండీస్‌తో పోరుకు సిద్ధమైంది. పసికూన ఆప్ఘన్‌పై చెమటోడ్చి గెలిచిందని.. నత్తనడక బ్యాటింగ్ అంటూ వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలని పట్టుదలగా ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో ఒకటి రద్దు కాగా నాలుగింట గెలిచి 9పాయింట్లతో టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరువలో ఉంటే.. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓడి 3పాయింట్లతో వెస్టిండీస్ నాకౌట్ ఆశలను దాదాపు గల్లంతు చేసుకుంది. ఈమ్యాచ్ విండీస్‌కు చావో రేవో లాంటిది.

జట్లు అంచనా..
భారత్: కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శంకర్, జాదవ్, ధోనీ, పాండ్య, షమీ, చాహల్/జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా.
వెస్టిండీస్: క్రిస్ గేల్, లెవిస్/అంబ్రిస్, హోప్(వికెట్ కీపర్), పూరన్, హిట్మైర్, హోల్డర్(కెప్టెన్), బ్రాత్‌వైట్, నర్స్, కార్టెల్, కీమర్ రోచ్, థామస్.

Loading...