Thursday, March 28, 2024
- Advertisement -

ప్రేమ‌లో ప‌డ్డ రిష‌బ్ పంత్‌…ప్రియురాలు ఎవ‌రంటే…?

- Advertisement -

టీమిండియా యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ప్రేమ‌లో ప‌డ్డాడు. ఓఅమ్మాయితో క‌ల‌సి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే అతనెప్పుడూ అంత ఉల్లాసంగా ఎందుకు ఉంటాడో.. అతని సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలిసింది. పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటోతో ఈ విషయాన్ని వెల్లడించాడు. అందులో ఓ అమ్మాయితో దిగిన ఫొటోను పంత్ షేర్ చేశాడు. నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం నువ్వే.. అందుకే నిన్ను సంతోషంగా ఉంచడమే నా పని అని పంత్ ఓ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇంత‌కు రిష‌బ్ ప్రేమించిన అమ్మాయి ఎవ‌ర‌నుకుంటున్నారా..! ఆమె పేరు ఇషా నేగి. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌ కూడా. ఇషా కూడా అదే ఫొటోను షేర్‌ చేయడం విశేషం. ‘మై మ్యాన్‌, మై సోల్‌మేట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌, లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అంటూ ఆమె క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో వీరిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని అభిమానులు అంటున్నారు. 21 ఏళ్ల పంత్‌ ఇలాంటి ఫోటోతో గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేయడం ఆసక్తికర చర్చగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -