ర్యాంకింగ్స్‌లో కోహ్లికి షాక్‌ కి ఊహించని షాక్..!

1375
indian captain virat kohli loses no.1 spot in latest icc rankings
indian captain virat kohli loses no.1 spot in latest icc rankings

ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ళకు షాక్ తగిలింది. ప్రధానంగా టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ టాప్ ర్యాంక్ ను కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భార‌త్ ప‌ది వికెట్ల‌తో ఓటమిని చూసిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ కలిపి కోహ్లీ కేవలం 21 ప‌రుగులు మాత్రమే చేశాడు. దాంతో బ్యాటింగ్ లో విఫలమై టాప్ ర్యాంక్ ను కోల్పోయాడు. ప్రస్తుతం కోహ్లీ 906 పాయింట్ల‌తో రెండో స్థానానికి ప‌డిపోయాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్ల‌తో టాప్ ర్యాంకుకు ఎగ‌బాకాడు. అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా, మ‌యాంక్ అగ‌ర్వాల్ వరుసగా 8,9,10వ ర్యాంకుల్లో ఉన్నారు.

తొలి టెస్టులో ఒక్క వికెట్ మాత్ర‌మే తీయడం కారణంగా జ‌స్‌ప్రీత్ బుమ్రా 11వ ర్యాంకుకు ప‌డిపోయాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ తొమ్మిదో ర్యాంకులో ఉన్నారు. ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో అశ్విన్ ఐదోస్థానం ద‌క్కించుకోగా.. ర‌వీంద్ర జ‌డేజా మూడో ర్యాంకులో ఉన్నాడు. ఇక రెండోటెస్టు ఈనెల 29 నుంచి క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రుగుతుంది.

Loading...