Friday, March 29, 2024
- Advertisement -

కోహ్లీపై విమర్శలేనా……. దక్షిణాఫ్రికా కుట్రలను ప్రశ్నించరా?

- Advertisement -

సిరీస్ గెలుపే లక్ష్యంగా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన కోహ్లిసేన లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఆ మరుక్షణమే విమర్శకులందరూ కూడా విరాట్ కోహ్లిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీం సెలక్షన్ నుంచి అన్ని విషయాల్లోనూ కోహ్లీని వేలెత్తి చూపుతున్నారు. భారతదేశ మీడియా మొత్తం ఇప్పుడు కోహ్లిని విమర్శించడాన్నే పనిగా పెట్టుకుంది. ఇండియా టూర్‌కి వచ్చినప్పుడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు ఇంతో ఘోరంగా ఓడిపోతే ఆయా దేశాల మీడియా సంస్థలు కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టుగా సాకులు వెతికేవి. స్పిన్ పిచ్‌లు అంటూ రాగాలు తీసేవి. మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నవి ఫాస్ట్ పిచ్‌లు కాదా? నిజానికి అవి ఒక పద్ధతిగా ఉన్న ఫాస్ట్ పిచ్‌లు కూడా కాదు. ఒక బాల్ మరీ లోగా వెళుతుంటే…….మరో బాల్ మరీ ఎక్కువ బౌన్స్ అయ్యేలా తయారు చేసిన పిచ్‌లు.

ఆ పిచ్‌ల వ్యవహారం గురించి ముందే అవగాహన ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు ఒక వ్యూహం ప్రకారం ఆడి గెలిచింది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే కుట్ర అనొచ్చేమో. ఇలాంటి కుట్రలనే ఇండియాలో కనుక కోహ్లి సేన అమలు చేస్తే సౌత్ ఆఫ్రికాకు అన్నీ ఇన్నింగ్స్ పరాజయాలే మిగులుతాయన్నది నిజం. రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కోహ్లి క్రీజ్‌లో ఉన్నంత సేపూ కూడా సౌత్ ఆఫ్రికా బౌలర్లు నెగిటివ్ బౌలింగ్‌కి దిగారు. ఈ విషయాన్ని కామెంటేటర్స్ కూడా చాలా సార్లు చెప్పారు. కోహ్లిని నెగిటివ్ బౌలింగ్‌తో విసిగించి……..బోర్ కొట్టేలా చేసి…..తనంతట తానే అవుటయ్యేలా చేయాలన్నది సౌత్ ఆఫ్రికా ప్లాన్ అని గ్రేట్ కామెంటేటర్ హర్షా భోగ్లే డైరెక్ట్‌గా కామెంట్ చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్‌కి ఇండియన్ బ్యాట్స్‌మేన్ బెదిరిపోయారని రాస్తున్న ఇండియన్ మీడియా ఈ విషయం గుర్తించదా? వాళ్ళ బౌటింగ్‌పై అంత నమ్మకం ఉంటే కోహ్లికి నెగిటివ్ బౌలింగ్ వేయాల్సిన అసవరం ఏమొచ్చింది? అంటే కోహ్లి బ్యాటింగ్ సామర్థ్యం ముందు వాళ్ళ బౌలర్లు నిలబడలేరని సౌత్ ఆఫ్రికా ఒప్పుకున్నట్టా? ఇప్పటి వరకూ అయితే ఫాస్ట్ బౌలింగ్ పిచ్…….లేదా స్వింగ్ పిచ్…లేదా స్పిన్ పిచ్‌లు మాత్రమే చూశాం. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం ఒక పద్ధతిలో పిచ్ రెడీ చేయకుండా…. ఒక బాల్ లో బౌన్స్ అయ్యేలా……మరో బాల్ హై బౌన్స్ అయ్యేలా పిచ్‌లు రెడీ చేసి కోహ్లి లాంటి బెస్ట్ బ్యాట్స్‌మేన్‌కి నెగిటివ్ బౌలింగ్ వేసి పరుగులు రాకుండా చేసి ఇతర బ్యాట్స్‌మేన్‌ని మాత్రం పూర్తిగా డిఫెన్స్‌లో పడేశారు.

ఇక టీం సెలక్షన్ గురించి విరాట్ కోహ్లిని విమర్శిస్తున్నవాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. భువనేశ్వర్ ప్లేస్‌లో టీంలోకి వచ్చిన ఇషాంత్ శర్మ అద్భుతంగా రాణించాడు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కూడా బాగా రాణించారు. భువనేశ్వర్‌ని టీంలోకి తీసుకోవాలంటే ఈ ముగ్గురిలో ఎవరిని పక్కన పెట్టాలో విమర్శకులు చెప్పగలరా? పూర్తిగా ఫాం కోల్పోయిన రహానే ఇండియాలో శ్రీలంకతో సిరీస్‌లోనే ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అలాంటి రహానే కంటే రోహిత్‌ని టెస్ట్ చేయాలనుకోవడం తప్పా? అయినా పూజారా, విజయ్‌లాంటి టెస్ట్ ఆటగాళ్ళు కూడా ఫెయిల్ అయిన సందర్భంలో కోహ్లి ఒక్కడే బ్యాట్స్‌మేన్‌గా స్థాయికి మించి చేశాడు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్లకు ఆలౌట్ చేయడంలో ప్రతి సందర్భంలోనూ భారత బౌలర్స్ సక్సెస్ అయ్యారు. అంటే కెప్టెన్‌గా కూడా కోహ్లి సక్సెస్ అయినట్టే. బ్యాట్స్‌మేన్ చేతులెత్తేస్తే ఏ కెప్టెన్ మాత్రం ఏం చేయగలడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -