రాహుల్, పాండ్యా వ్యాఖ్య‌ల‌పై స్పందించిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ…

326
Indian team does not support inappropriate comments: Says Virat Kohli
Indian team does not support inappropriate comments: Says Virat Kohli

కాపీ విత్ క‌ర‌ణ్ కార్య‌క్ర‌మంలో టీమిండియా ఆట‌గాళ్లు రాహుల్‌, పాండ్యాలు మ‌హిళ‌ల‌పై ఇటీవ‌ల చేసిన అస‌భ్య‌క‌ర‌ కామెంట్లపై దుమారం చెల‌రేగుతోంది. ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌పై స‌స్పెన్స‌న్ వేటుకు బీసీసీఐ రెడీ అవుతోంది. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై కెప్టెన్ కోహ్లీ స్పందించారు. దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ క్రికెట‌ర్లు అలాంటి కామెంట్లు చేయ‌డం తప్ప‌న్నారు. అవి వారి వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌ల‌ని వాటితో జ‌ట్టుకు సంబంధంలేద‌ని తెలిపారు.

దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క్రికెట‌ర్లు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని ఆలా మాట్లాడ‌టం ఆమోదయోగ్యం కాద‌క‌న్నారు. పాండ్యా, రాహుల్‌పై బీసీసీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని గురించి వేచి చూస్తున్నట్టు చెప్పాడు. ఈ వివాదం జ‌ట్టుపై ఎలాంటి ప్ర‌భావం చూప‌బోద‌న‌న్నారు.

ఇది దురదృష్టకరమైన సంఘటన అని, ఇలాంటివి మన నియంత్రణలో ఉండవని అతను చెప్పాడు. ఇలాంటివి జరిగినప్పుడు టీమ్ సమతౌల్యం దెబ్బతింటుంది. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది అని విరాట్ తెలిపాడు. పాండ్యా, రాహుల్‌లపై బీసీసీఐ 2 మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. వీరిపై చర్యలు తీసుకుంటే ఆస్ట్రేలియాలో శనివారం ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడే అవకాశం కోల్పోనున్నారు.