Thursday, April 25, 2024
- Advertisement -

అక్క‌డ ఉండేది ధోని…ధోనీతోనే ప‌రాచ‌కాలా….?

- Advertisement -

వికెట్ల వెనుక ధోని ఉన్నాడంటె బ్యాట్స్ మేన్‌లు జ‌ర జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. బ్యాట్స్ మేన్ బంతినైనా ఆపాలి లేకుండా క్రీజు వ‌దిలి వెల్ల‌కూడ‌దు. హాఁ ఏమౌతుందిలే అని ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఇక ఆ బ్యాట్స్‌మెన్‌కు మిగిలేది పెవిలియన్‌కు చేరాల్సిందే. క్రీజులో ఉన్నా సరే.. కాలు కదిపితే చాలు.. ఆ కదిపిన రెప్ప‌పాటు క్షణంలోనే బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు పంపిస్తాడు ధోని.

చెన్నై వేదికగా బుధవారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ మరోసారి తన కీపింగ్‌లో మెరుపులతో అదరగొట్టాడు. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ఇద్దర్ని స్టంపౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపించాడు.
అలాంటి ధోని ముందె ఢిల్లీ బ్యాట్స్‌ మేన్‌లు ప‌రాచ‌కాలాడారు. వికెట్ల వెనుక ధోనీ ఎంత చురుగ్గా ఉంటాడో..? తెలిసి కూడా ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు క్రీజు వెలుపలికి వెళ్లి షాట్స్ ఆడేందుకు సాహసించడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పంచ్‌లు పేలుతున్నాయి.

11వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజా వేసిన నాలుగో బంతిని దిల్లీ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ మోరిస్‌ తప్పుగా అంచనావేయడంతో ఆ బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. ఇంకేముంది వెంట‌నె మోరిస్‌ను స్టంపౌట్‌ చేసి అప్పీల్‌ చేశాడు. రిప్లేలో మోరిస్‌ కాలు ఒక్క క్షణం గాల్లోకి లేచినట్లు కనిపించింది. అయితే, సరిగ్గా అదే సమయంలో ధోనీ బెయిల్స్‌ను లేపడంతో మోరిస్‌ అనూహ్యంగా డకౌట్‌ కావాల్సి వచ్చింది.

ఓవర్‌లో ఆఖరి బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు. ధోనీ మళ్లీ స్టంపౌట్‌కు అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరాడు. మోరిస్‌ ఔట్‌కు ఇది దాదాపు జిరాక్స్‌ కాపీలా అనిపించింది. అయితే ఆ బంతి శ్రేయస్‌ బ్యాట్‌ను తాకడంతో అంపైర్‌ క్యాచ్‌ ఔట్‌గా ప్రకటించాడు.మోరిస్‌ను స్టంపౌట్‌ చేసేందుకు ధోనీకి పట్టిన సమయం కేవలం 0.12 సెకన్లు మాత్రమే. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ను స్టంప్‌ చేసేందుకు 0.16 సెకన్లు పట్టింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 80 ప‌రుగుల తేడాతో ఢిల్లీపై గెలిచింది.

https://twitter.com/amitkyadav22/status/1123640909583663104
https://twitter.com/AjKhan788/status/1123640551142674432

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -