Saturday, April 20, 2024
- Advertisement -

సన్‌రైజర్స్‌ని పంత్ ఉతికారేసిన పంత్‌…. ఇంటికి చేరిన హైద‌రాబాద్‌

- Advertisement -

అదృష్టం కలిసొచ్చి ప్లే ఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అచ్చొచ్చిన స్టేడియం, సొంత ప్రేక్షకులు ఇవేవి రైజర్స్ రాత మార్చలేకపోయాయి. లీగ్‌లో కొనసాగాలంటే కచ్చితంగా గెలవాల్సిన ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ విఫలమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది.

మొద‌ట టాస్ ఓడి బ్యాటింగ్‌కు వ‌చ్చిన స‌న్ రైజ‌ర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (19 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్సర్లు), మనీశ్‌ పాండే (36 బంతుల్లో 30; 3 ఫోర్లు), కెప్టెన్‌ విలియమ్సన్‌ (27 బంతుల్లో 28; 2 ఫోర్లు), విజయ్‌ శంకర్‌ (11 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా అమిత్‌ మిశ్రా (1/16) అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేయగా, కీమో పాల్‌కు 3 వికెట్లు దక్కాయి.

అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు… ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రిషభ్‌ పంత్‌ (21 బంతుల్లో 49; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక బ్యాటింగ్‌ క్యాపిటల్స్‌ను గెలిపించాయి. పృథ్వీ షా హాఫ్ సెంచరీకి … మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రిషభ్ పంత్ మెరుపులు తోడవడంతో ఛేదన పెద్ద కష్టం కాలేదు.ఈ విజయంతో ముందడుగు వేసిన క్యాపిటల్స్ శుక్రవారం ఇక్కడే జరుగనున్న క్వాలిఫయర్-2లో చెన్నైని ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -