Friday, April 19, 2024
- Advertisement -

ధోని ఇక అన్ని స‌ర్దుకో…..చెన్నైపై పేలుతున్న జోకులు..

- Advertisement -

ఉత్కంఠ‌గా సాగిన ఐపీఎల్ 2019 ఫైన‌ల్లో చివ‌ర‌కు ముంబ‌య్‌నే విజ‌యం వ‌రించింది. మూడో సారి కూడా ధోని సేనను చిత్తు చేసి ఐపీఎల్‌ –2019 విజేతగా నిలిచింది. నాకౌట్స్‌లో చెన్నైపై ఉన్న అద్వితీయ రికార్డును కాపాడుకుంటూ రోహిత్ సేన నాలుగోసారి ట్రోఫీ అందుకుంది. అచ్చొచ్చిన భాగ్యనగరంలో రోహిత్ ట్రోఫీని ముద్దాడింది.

ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. చెన్నై విజయానికి చివరి ఒక బంతికి రెండు పరుగులు అవసరమవగా.. లసిత్ మలింగ వికెట్ల ముందు శార్ధూల్ ఠాకూర్‌ని ఎల్బీడబ్ల్యూగా దొరకబుచ్చుకున్నాడు.ఫైనల్లో ఒక పరుగు తేడాతో గెలిచిన ముంబయి టీమ్.. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఫైన‌ల్లో ఓడిన చెన్నైపై నెట‌జ‌న్లు కామెంట్ల‌తో విరుచుకు ప‌డ్డారు.

మ్యాచ్‌లో తొలుత కీరన్ పొలార్డ్ (41 నాటౌట్: 25 బంతుల్లో 3×4, 3×6), ఓపెనర్ డికాక్ (29: 17 బంతుల్లో 4×6) నిలకడగా ఆడటంతో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసిన ముంబయి టీమ్.. అనంతరం ఛేదనకు దిగిన చెన్నై టీమ్‌ని 148/7కే పరిమితం చేసింది.

https://twitter.com/RP_Rajavel/status/1127780345644929024

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -