Thursday, March 28, 2024
- Advertisement -

ఐపీఎల్ 12వ సీజ‌న్ ఇండియాలోనే…

- Advertisement -

ఐపీఎల్ 12 వ జీగ‌న్ ఇండియాలోనే జ‌ర‌గ‌నుంద‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్న నేప‌ధ్యంలో వేరే దేశాల్లో ఐపీఎల్ జ‌రుగుతుంద‌నే వార్త‌ల‌కు చెక్ ప‌డింది. అయితే ఈ సారి ముందుగా ఆరంభం కానుంది. సీఏఓఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. అందరితో మాట్లాడిన తర్వాత టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) వెల్లడించింది.

ఐపీఎల్ 12వ ఎడిషన్ ఇండియాలో నిర్వ‌హించాలా లేకా విదేశాల్లో నిర్వ‌హించాల‌నే దానిపై సీఓఏ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, సంబంధిత అధికారులతో ప్రాథమికంగా చర్చించారు. చ‌ర్చ‌ల అనంత‌రం ఐపీఎల్ 12వ ఎడిషన్ ఇండియాలోనే నిర్వహించాలని నిర్ణయించాం అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలిసారి 2009లో టోర్నీ సౌతాఫ్రికాలో జరిగింది. ఆ తర్వాత 2014లో సగం టోర్నీ యూఏఈలో, మిగతా సగం ఇండియాలో జరిగింది. ఈ సారి కూడా విదేశాల్లో జ‌రుగు తుంద‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సారి వ‌రల్డ్ క‌ప్ ఉన్న నేప‌ధ్యంలో కనీసం 15 రోజుల గ్యాప్ ఉండేలా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -