Friday, April 19, 2024
- Advertisement -

డేవిడ్ వార్న‌ర్ మెరుపు అర్ధ‌శ‌త‌కం…కోల్‌క‌తాకు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించిన హైద‌రాబాద్‌

- Advertisement -

ఐపీఎల్‌ 2019 సీజన్‌లో భాగంగా హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ , కోల్‌క‌తా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ భారీ స్కోరు చేసింది. డేవిడ్ వార్న‌ర్ మెరుపులు మెరిపించ‌డంతో 3 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగుల భారీ స్కోరు న‌మోదు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (85: 53 బంతుల్లో 9×4, 3×6) మెరుపు అర్ధశతకం సాధించాడు. వార్న‌ర్ తొలివికెట్‌కు జానీ బెయిర్‌స్టో (39: 35 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ (40 నాటౌట్: 24 బంతుల్లో 2×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హిట్టర్ యూసఫ్ పఠాన్ (1: 4 బంతుల్లో) నిరాశపరచగా.. మనీశ్ పాండే (8 నాటౌట్: 5 బంతుల్లో 1×4) ఆఖర్లో కాసేపు శంకర్‌కి సహకారం అందించాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ మ్యాచ్‌కి దూరమవడంతో.. వైస్ కెప్టెన్ భువనేశ్వర్ టాస్‌కి వచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -