Thursday, April 25, 2024
- Advertisement -

ముంబ‌య్‌కి దేవుడిచ్చిన వ‌జ్రం పాండ్యా…

- Advertisement -

ఈ ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబయి జట్టుకు హార్ధిక్ పాండ్యా వ‌రంలా మారాడు. ప్లేఆఫ్‌కు సునాయాసంగా చేర‌డంతో హార్థిక్ కీల‌క పాత్ర పోషించాడు. ముంబ‌య్ విజ‌యాల్లో హార్థిక్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. సీజన్ ఆరంభంలో తన పవర్ హిట్టింగ్‌తో టీమ్‌కి భారీ స్కోర్లు అందించిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ వికెట్లు పడగొడుతూ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగాకి అండగా నిలుస్తున్నాడు.

లీగ్ దశలో కొన్ని మ్యాచ్‌ల్లో నామమాత్రపు స్కోర్లు చేసినా.. ముంబయి జట్టు విజయాల్ని అందుకోగలిగింది. తాజా సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన హార్దిక్ పాండ్య 380 పరుగులు చేయడమే కాకుండా.. బంతితోనూ చెలరేగి 14 వికెట్లు పడగొట్టాడు.

కోల్‌కతా‌తో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్య బంతితో సత్తాచాటి ప్రమాదకర ఓపెనర్ క్రిస్‌లిన్ (41: 29 బంతుల్లో 2×4, 4×6)తో పాటు ఇటీవల హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన శుభమన్‌ గిల్ (9)‌లను వరుస ఓవర్లలో ఔట్ చేసేశాడు. దీంతో కోల్‌క‌తా 133/7కే ప‌రిమితం అయ్యింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన ముంబ‌య్ మరో 23 బంతులు మిగిలి ఉండగానే ముంబయి 134/1తో ఛేదించేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -