Saturday, April 20, 2024
- Advertisement -

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

- Advertisement -

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై ఆగ్రస్థానంకు వెళ్ళగా.. చెన్నై అట్టడుగు స్థానంకు వెళ్లింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. ఈ ఏడాది తమకు కలిసి రాలేదని.. వరుస పరాజయాలు హర్ట్ చేశాయని అన్నాడు.

బ్యాటింగ్ వైఫల్యంతోనే ఈ సీజన్‌లో మూల్యం చెల్లించుకున్నామని, కనీసం వచ్చే ఏడాదికైనా క్లారిటీగా ఉండటం తమకు చాలా ముఖ్యమన్నాడు. ఇంకా ధోనీ మాట్లాడుతూ.. క్రికెట్‌లో టఫ్ ఫేస్‌ను ఎదుర్కొంటున్నప్పుడు కొంచెం లక్ కూడా అవసరం. కానీ అది మాకు ఏ మాత్రం లేదు. అయితే ఓడినప్పుడు 100 కారణాలు చెప్పవచ్చు. కానీ జట్టు సామర్థ్యానికి తగినట్లు ఆడితే పరిస్థితులతో సంబంధం లేకుండా ఫలితాలు రాబట్టవచ్చు. ఈ ఏడాది మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది. అయితే ఇదంతా ఆటలో భాగమే.

వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా తమ ఆటగాళ్లు పోరడటానికి ప్రయత్నించారు. వారి సాయశక్తుల రాణించడానికి కృషి చేశారు. తదుపరి మూడు మ్యాచ్ ల్లో యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తాం. డెత్ ఓవర్లలో ఒత్తిడిని తట్టుకోని బౌలింగ్,బ్యాటింగ్ చేసేదేవరో గుర్తిస్తాం. ఇప్పటివరకు ఛాన్స్ అందుకోని ఆటగాళ్లందరికి ఛాన్స్ ఇస్తాం అని ధోనీ చెప్పుకొచ్చాడు.

తప్పు ఒప్పుకున్న ధోని.. ఇకపై వారికి ఛాన్స్..?

ఫైనల్ కి చేరకుండా చెన్నై ఇంటికే వేల్లనుందా..

ఐపిఎల్ లో ఫైనల్ కి వెళ్ళేది ఆ జట్లే.. యువీ జోస్యం..

రాజస్థాన్ ఆటగాడు తెవాటియా పై సెహ్వాగ్ ప్రశంశలు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -