Thursday, March 28, 2024
- Advertisement -

ఇంగ్లండ్‌కు ప్ర‌పంచ‌క‌ప్ అందించిన కోచ్‌ను లాక్కున్న హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్‌..

- Advertisement -

హైద‌రాబాద్ స‌న్‌రైర్స్ జాక్ పాట్ కొట్టింది. ఇంగ్లండ్‌కు ప్ర‌పంచ‌క‌ప్ అందించిన ఆ జ‌ట్టు కోచ్ ట్రెవర్‌ బేలిస్‌ను త‌మ కోచ్‌గా నియ‌మించుకుంది స‌న్‌రైర్స్‌. క్రికెట్ కు పుట్టిల్లు ఇంగ్లాండ్ అయినా, నిన్నటి వరకు ఆ జట్టు ఖాతాలో ఓ ప్రపంచకప్ కూడా లేదు. కాని సొంతగడ్డపై ఇంగ్లాండ్ వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ .ఈ మేరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్విటర్‌ వేదికగా స్పష్టం చేసింది.

ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్‌ బేలిస్‌ శిక్షణలో ఇంగ్లండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా నిలవడంతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీపడ్డాయి. కోల్‌కతా నైట్‌​రైడర్స్‌ కూడా బేలిస్‌ కోసం చివరి వరకు ప్రయత్నించింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో తమ జట్టుకు కోచ్‌గా సేవలందించేందుకు బేలిస్‌కు సన్‌రైజర్స్‌ భారీ మొత్తంలో ఆఫర్‌ చేసినట్లు తెలిసింది.

ఆటగాళ్లలో కసి రగల్చడంలో బేలిస్ తర్వాతే ఎవరైనా. యావరేజ్ జట్టుగా ఉన్న ఇంగ్లాండ్ ను వన్డేల్లో విధ్వంసక శక్తిగా మలిచాడు. ఇప్పుడు వరల్డ్ కప్ ముగియడంతో బేలిస్ తో ఇంగ్లాండ్ కాంట్రాక్టు కూడా ముగిసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ అందరికంటే ముందే బేలిస్ ను దక్కించుకుంది.

సన్ రైజర్స్ కు ఇప్పటివరకు టామ్ మూడీ కోచ్ గా వ్యవహరించాడు. మూడీతో కాంట్రాక్టు ముగియడంతో సన్ రైజర్స్ యాజమాన్యం ట్రెవర్ బేలిస్ ను హెడ్ కోచ్ గా టీమ్ లో భాగం చేసింది. కోచ్ గా తిరుగులేని రికార్డు ఉన్న బేలిస్ గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు కూడా కోచ్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో కోల్ కతా రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. విష‌యం ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అంత‌ర్జాతీయ మ్యాచ్ కూడా ఆడ‌ని బేలిస్ తిరుగులేని కోచ్‌గా పేరు సంపాదించాడు. ఆస్ట్రేలియాకి చెందిన బేలిస్ దేశవాళీ క్రికెట్ లో 58 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అయితే అద్భుతమైన కోచింగ్ నైపుణ్యం బేలిస్ ను ప్రముఖ జట్లకు దగ్గర చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -