Friday, March 29, 2024
- Advertisement -

ఆ క్రికెట‌ర్‌పై జీవిత‌కాల నిషేధాన్ని ఎత్తేయండి బీసీసీఐకు సుప్రీం ఆదేశాలు..

- Advertisement -

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో జీవిత కాల‌నిషేధాన్ని ఎదుర్కొంటున్న క్రికెట‌ర్ శ్రీశాంత్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. అతనిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాలని సుప్రీంకోర్టు బీసీసీఐని ఆదేశించింది. కారణంగా తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ గత కొన్నేళ్లుగా పోరాడుతున్నాసంగ‌తి తెలిసిందే. తనకు అసలు ఏ శిక్షా విధించవద్దన్న శ్రీశాంత్ అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. అతనిపై జీవితకాల నిషేధం కాకుండా మరేదైనా శిక్ష విధించాలని, దీనిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.శిక్షపై అతని వాదన కూడా కమిటీ వినాలని అశోక్ భూషణ్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.

2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకుగాను శ్రీశాంత్ జీవితకాల నిషేధం విధించింది బీసీసీఐ. 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్‌ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్‌ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 అక్టోబర్‌లో బీసీసీఐ పిటిషన్ మేరకు శ్రీశాంత్‌పై కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ బీసీసీఐ విధించిన జీవిత‌కాల నిషేధాన్ని కొన‌సాగించాల‌ని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేసిన శ్రీశాంత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -