Saturday, April 20, 2024
- Advertisement -

సెహ్వాగ్‌ లాగా రోహిత్ రాణించగలడా ? సందేహమే : ఇర్ఫాన్ పఠాన్

- Advertisement -

టీమిండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ ‌శర్మ వన్డేల్లో ఓ చాంపియన్ అని మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. టెస్టుల్లో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​లా.. ప్రస్తుతం రోహిత్ శర్మ అదరగొట్టగలడన్నాడు. అయితే అయితే టెస్టుల్లో‌ సెహ్వాగ్‌ ఆడినన్ని మ్యాచ్‌లు రోహిత్ ఆడలేకపోవచ్చని అని ఇర్ఫాన్ అన్నారు.

తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌తో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..”వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన రోహిత్ నుంచి టెస్టుల్లోనూ డబుల్ సెంచరీలు చూడాలి. రోహిత్ మంచి ఫి​ట్​నెస్​తో కొనసాగితే.. వీరేంద్ర సెహ్వాగ్​లా ప్రభావం చూపగలడు. వీరేంద్ర సెహ్వాగ్ 100 టెస్టులు ఆడాడు. రోహిత్‌ అన్ని టెస్టులు ఆడతాడా అనే విషయంపై సందేహం తలెత్తుతుంది. వన్డేల్లో మాత్రం రోహిత్ ఓ చాంపియన్​. నా టాప్​-3 బ్యాట్స్​మెన్​లో రోహిత్ కచ్చితంగా ఉంటాడు’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.

ఇక టెస్టుల్లో 2013లోనే అరంగేట్రం చేసిన రోహి​త్​.. మిడిలార్డర్​లో బ్యాటింగ్ చేస్తూ రాణించలేకపోయాడు. గతేడాది ఓపెనర్​గా మారి సుదీర్ఘ ఫార్మాట్​లోనూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టెస్టుల్లో ఓపెనర్​గా గతేడాదే అవతారమెత్తిన రోహిత్. ఓపెనర్​గా తొలి మ్యాచ్​లోనే రెండు శతకాలు బాదిన తొలి బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. ఒక డబుల్ సెంచరీ కూడా చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రోహిత్ ఇప్పటివరకు 32 టెస్టుల్లో, 224 వన్డేల్లో, 108 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

రిషబ్ పంత్‌ రాణించాలంటే కోహ్లీ ఇలా చేయాలి : పఠాన్

సచిన్‌ సలహా వల్లే ఉత్తమ టెస్టు క్రికెటర్ అయ్యాను : కోహ్లీ

కోహ్లీ భయం అంటే ఏంటో తెలియదట : లాయిడ్

టీమిండియాలోకి ధోనీ మళ్లీ ఎంట్రీ ఇవ్వాలంటే ఇదొక్కటే మార్గమట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -