Friday, March 29, 2024
- Advertisement -

రోహిత్‌ ఈజీగా డబుల్ సెంచరీ చేయడానికి కారణం ఇదే..!

- Advertisement -

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లో నాలుగు శతకాలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ రోహిత్. అయితే రోహిత్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం మాత్రం అతడి ‘పవర్ హిట్టింగ్’ అని పాకిస్థాన్‌ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ పేర్కొన్నాడు.

తాజాగా కమ్రాన్‌ అక్మల్ తన యూట్యూబ్ చాట్ షో క్రిక్ కాస్ట్‌లో పాకిస్తాన్ జర్నలిస్ట్ సావేరా పాషాతో మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ అద్భుత ఆటగాడు. అతను చాలా ఈజీగా నిబద్ధతతో బ్యాటింగ్‌ చేస్తాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూ ఉండాలి అనిపిస్తోంది. అతని బ్యాటింగ్ శైలి అంత బాగుంటుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 200, 150 పరుగులు చేయడం చాలా చాలా కష్టం. కానీ రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు బాదాడు. ఇటీవలి ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేశాడు. రోహిత్ బౌండరీలు బాదగలడు, సింగిల్స్ తీయగలడు. రోహిత్‌కు అతిపెద్ద బలం అతడి పవర్ హిట్టింగే.

ఆ పవర్ హిట్టింగ్ ద్వారానే భారీ షాట్లు మరియు సిక్సర్లు కొట్టగలడు. రోహిత్‌ బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని చూసి యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవాలి’ అని కమ్రాన్‌ అన్నాడు. ఇక అంతర్జాతీయ కెరీర్‌లో అక్మల్ ఇప్పటివరకు 53 టెస్టుల్లో, 157 వన్డేల్లో, 58 టీ20 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 11 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు చేశాడు. ఇక రోహిత్ భారత్ తరఫున 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 39 సెంచరీలు చేశాడు.

ఐపీఎల్ 2020 తర్వాత రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన హర్భజన్..!

రోహిత్ శర్మని ఔట్ చేయడం నా కల : పాక్ ఫేసర్

గంగూలీ, ధోనీ కెప్టెన్సీలో తేడా చెప్పిన గ్రేమ్ స్మిత్..!

లీడర్ అంటే ధోనీనే.. అందుకు అసలైన సాక్ష్యం ఇదే : మాజీ కోచ్ గ్యారీ…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -